Latest Posts

చిల్లకొండయ్యపల్లిలో బీజేపీ “మా ఊరు – మన జెండా” కార్యక్రమం ఘనంగా నిర్వహణ

చిల్లకొండయ్యపల్లిలో “మా ఊరు – మన జెండా” కార్యక్రమం ఘనంగా నిర్వహణ
తాడిమరి మండలంలోని చిల్లకొండయ్యపల్లి గ్రామంలో “మా ఊరు – మన జెండా” కార్యక్రమాన్ని బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ రాష్ట్ర బిజెపి అధ్యక్షులుపివిఎన్ మాధవ్ జిల్లా అధ్యక్షులు జిఎం శేఖర్ ఆదేశాల మేరకు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కొంక నాగార్జున ఆధ్వర్యంలో నిర్వహించబడింది.
ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ, భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా విస్తరించేందుకు కృషి చేసిన పార్టీ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం బీజేపీ కాషాయ జెండాను ఎగరవేసి, కేక్ కట్ చేసి ఆనందోత్సాహాలతో కార్యక్రమాన్ని జరుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కొంక నాగార్జున, గోపాల్ రెడ్డి, ఆరవేటి నారాయణస్వామి, కొంక రామన్న, కొంక తేజ ప్రతాప్, కొంక పోతలయ్య, చిల్లా కాటమయ్యతో పాటు బీజేపీ కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం గ్రామంలో ఉత్సాహభరిత వాతావరణంలో విజయవంతంగా ముగిసింది.

Posted Under AP
Editor