Latest Posts

అనంతపురం వాసుల దాహార్తికి శాశ్వత పరిష్కారం: 16 ఎం.ఎల్.డి వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించిన మంత్రి పయ్యావుల!

అనంతపురం జిల్లా, ఉరవకొండ.

*నగర ప్రజలకు శాశ్వత తాగునీటి పరిష్కారం దిశగా అడుగులు*

– *: కూడేరు మండలం ముద్దలాపురం వద్ద 16 ఎం.ఎల్.డి వాటర్ ప్లాంట్ ప్రారంభం*

– *: రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చేతుల మీదుగా వాటర్ ప్లాంట్ ప్రారంభం*

– *: ఇది మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం..: మంత్రివర్యులు పయ్యావుల కేశవ్*

– *: ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం నిరంతరం కృషి : ఎంపీ అంబికా..*

– *: 20 నెలల్లోనే ప్లాంట్ పూర్తి చేసాం : ఎమ్మెల్యే దగ్గుపాటి*

– *: 16 ఎం.ఎల్.డి వాటర్ ప్లాంట్ పూర్తికావడంలో దగ్గుపాటి కృషిని అభినందించిన మంత్రి పయ్యావుల

– *అనంతపురం నగరంలోని ప్రజలకు ఇక శాశ్వతంగా తాగునీటి సమస్యకు పరిష్కారం లభించింది. నగర ప్రజల కోసం 16 ఎం.ఎల్.డి సామర్థ్యం ఉన్న నీటి శుద్ధి కేంద్రం అందుబాటులోకి వచ్చింది. కూడేరు మండలం ముద్దలాపురం వద్ద రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు. ఆదివారం ఈ కార్యక్రమం అట్టహాసంగా సాగింది. ఈ కార్యక్రమంలో నాయకులు, అధికారులు పాల్గొన్నారు.*

– *ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ అనంతపురం నగర ప్రజల దాహార్తి తీర్చే విధంగా 16 ఎం.ఎల్.డి వాటర్ ప్లాంట్ పూర్తి చేయడంలో ఎమ్మెల్యే దగ్గుపాటి కృషిని ఆయన అభినందించారు. తమది మాటల ప్రభుత్వం కాదని.. చేతల ప్రభుత్వం అని అన్నారు. గత ప్రభుత్వంలో కేటాయింపులు మాత్రమే చూశారని.. పనులు ముందుకు జరగలేదన్నారు. తమ ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించిన విధంగా పనులు చేస్తోందని వివరించారు. గత ఏడాది బడ్జెట్లో హంద్రీనీవా కాలువ వెడల్పు, లైనింగ్ కోసం 3,800 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. ఒకే సీజన్లో రెండు పనులు పూర్తి చేశామన్నారు. ఈ ఏడాది కూడా మరో 2,000 కోట్ల రూపాయలు కేటాయించినట్లు చెప్పారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా మార్చేందుకు బడ్జెట్ల 30 వేల కోట్ల రూపాయలు కేటాయించమన్నారు. దీనిపై కేంద్రం కూడా సానుకూలంగా స్పందించిందన్నారు. ఓవైపు ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేస్తూనే.. ఇంకోవైపు తాగునీటి సమస్య కూడా తీర్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. మున్సిపాల్టీలో తాగునీటి సమస్య పరిష్కారానికి 700 కోట్ల రూపాయలు కేటాయించినట్లు చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రజలు ఓట్లు వేసినందుకు అమరావతి, పోలవరం నిర్మాణంతో పాటు రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఎప్పటిలానే జిల్లా కోసం కూలీగా పని చేస్తానని పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు.*

– *ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ అనంతపురం నగరానికి నీటి అద్దడి లేకుండా ముందస్తుగానే, అంటే వేసవి కాలం రాకముందే మంచి నీటి సమస్యను తీర్చడం కోసం 16 MLD ప్రాజెక్టును ఈరోజు ఇక్కడ ప్రారంభించడం జరిగిందన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ గారు కూడా అనంతపురం అభివృద్ధికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు. అనంతపురం జిల్లా భారతదేశంలోనే అత్యల్ప వర్షపాతం నమోదయ్యే రెండో జిల్లాగా గుర్తించబడింది కాబట్టి, ఇక్కడి సమస్యల పరిష్కారానికి వారు 700 కోట్ల రూపాయల నిధులను మున్సిపాలిటీల కోసం విడుదల చేశారన్నారు. మా ప్రభుత్వం ప్రజల సంక్షేమం మరియు అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తోందన్నారు. అనంతపురం నగరాన్ని, జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు మా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.*

– *ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి మాట్లాడుతూ 2017 లో ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతో ఈ నీటి శుద్ధి కేంద్రం ప్రారంభమైందన్నారు. అయితే గత ఐదేళ్లలో ఒక అడుగు కూడా ముందుకు పడలేదన్నారు. దీనివలన ప్రజలకు తాగునీటి సమస్య ఏర్పడిందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 20 నెలల్లో ఎంతో శ్రమించి ఈ నీటి శుద్ధి కేంద్రాన్ని పూర్తి చేసినట్లు చెప్పారు. మూడు నెలల పాటు ట్రయల్ రన్ నిర్వహించి.. అంతా సురక్షితం అన్న తర్వాత ప్రారంభోత్సవం చేసినట్లు చెప్పారు. ఇక నగరవాసులకి తాగునీటి సమస్య ఉండదన్నారు. సాగు, తాగునీటి విషయంలో ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధితో ముందుకు వెళ్తోందన్నారు. గత ఏడాది బడ్జెట్లో హంద్రీనీవా కోసం 3800 కోట్లు కేటాయించారన్నారు. కేవలం వంద రోజుల్లోనే హంద్రీనీవా కాలువ వెడల్పు చేసి కుప్పం వరకు నీరు తీసుకెళ్లారమన్నారు. ఈ ఏడాది కర్ణాటక సరిహద్దుల్లోని మడకశిర వరకు నీరు తీసుకెళ్తున్నట్లు చెప్పారు. 30 వేల కోట్లతో రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్ గా మార్చబోతున్నట్లు దగ్గుపాటి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అనంతపురం నగరపాలక సంస్థ కమిషనర్ జస్వంత్ రావు, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ అర్షదుల్లా, నాయకులు తదితరులు పాల్గొన్నారు.*

Posted Under AP
Editor