అనంతపురం జిల్లా,రామ్‌నగర్.
*”ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మంత్రి పయ్యావుల ప్రజాదర్బార్”*
– *: రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్..*
– *అనంతపురంలోని రామ్‌నగర్‌లో ఉన్న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆదివారం రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ ప్రజా సమస్యల పరిష్కరణకు “ప్రజాదర్బార్” కార్యక్రమం నిర్వహించారు.*
– *ఈ కార్యక్రమానికి అనంతపురం జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు, నాయకులు సమస్యలను స్వయంగా విన్న మంత్రివర్యులు వారి నుండి వినతిపత్రాలను స్వీకరించారు. ప్రజల సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.*
– *ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.*
– *తమ ప్రభుత్వానికి అభివృద్ధి మరియు సంక్షేమం రెండూ సమానంగా ముఖ్యమని పేర్కొంటూ, అర్హులైన ప్రతి పేదవారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా సమర్థవంతమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా అమలు చేస్తూ, అన్ని వర్గాల ప్రజల సంక్షేమం దిశగా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు.*
– *రాష్ట్రాన్ని సమగ్ర అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రివర్యులు స్పష్టం చేశారు.*
