Latest Posts

ఈనెల 6న యాడికిలో సీఎం చంద్రబాబు పర్యటన: పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్, ఎస్పీ ఆదేశం!

అనంతపురం జిల్లా.

*ఈనెల 6వ తేదీన యాడికిలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన..*

– *సీఎం పర్యటన కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టాలి*

– *: ఎలాంటి లోటుపాట్లు ఉండరాదు..*

– *: ముఖ్యమంత్రి పర్యటన కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్, జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్..*

– *: యాడికిలో రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ముఖ్యమంత్రి పర్యటన కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్, జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్, జిల్లా ఎస్పీ పి.జగదీష్, తదితరులు..*

అనంతపురం, ఏప్రిల్ 04 :

– *ఈనెల 6వ తేదీన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనంతపురం జిల్లా, తాడిపత్రి నియోజకవర్గంలోని యాడికి మండలంలో పర్యటించనున్న నేపథ్యంలో.. సీఎం పర్యటన కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి పర్యటన కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్, జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా యాడికి మండల కేంద్రం వద్దనున్న మార్కెట్ యార్డులో, హెలిప్యాడ్ వద్ద, సీఎం జలహారతి నిర్వహించే పెండేకల్లు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వద్ద ఏర్పాట్లను ముఖ్యమంత్రి పర్యటన కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్, జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్, జిల్లా ఎస్పీ పి.జగదీష్, తదితరులు పరిశీలించారు.*

– *ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పర్యటన కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్, జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ మాట్లాడుతూ సీఎం పర్యటన ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు ఉండరాదని ఆదేశించారు. ముందుగా హెలిప్యాడ్ వద్ద ఏర్పాట్లు సిద్ధం చేయాలని, బ్యారికేడ్ ఏర్పాటు పూర్తి చేయాలన్నారు. మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసే ప్రజావేదిక వద్ద డయాస్ ఏర్పాట్లు బాగా చేయించాలని, స్టాల్స్ ఏర్పాటు చేయాలన్నారు. యాడికి మండల యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలన్నారు. ప్రజావేదిక వద్ద హై స్పీడ్ ఇంటర్నెట్ ఏర్పాటు చేయాలని, పార్కింగ్ ఏర్పాట్లు ఇబ్బంది లేకుండా చేపట్టాలని, మినిట్ టు మినిట్ సిద్ధం చేయాలని ఆదేశించారు.*

– *పెండేకల్లు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వద్ద నిర్వహించే జలహారతి కార్యక్రమానికి జాగ్రత్తగా ఏర్పాట్లు చేపట్టాలన్నారు. ఏపీసీఎన్ఎఫ్ – ఆర్వైఎస్ఎస్ (రైతుకు సాధికార సంస్థ) వారి పిడిఎంఎస్ (ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్) జీరో బేస్ న్యాచురల్ ఫార్మింగ్, డ్వామా పరిధిలో ఎన్ఆర్ఈజిఏ, ఏపీఎంఐపి కింద డ్రిప్ ఇరిగేషన్ పనులు చేపట్టాలని ఆదేశించారు. సీఎం పర్యటన కోసం వేగవంతంగా అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.*

– *అనంతరం తాడిపత్రి ఎమ్మెల్యే జెసి అస్మిత్ రెడ్డి ప్రజావేదిక, సభాస్థలి వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. సీఎం పర్యటన కోసం ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అంతకుముందు జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ సీఎం పర్యటన నేపథ్యంలో ప్రజావేదిక, సభాస్థలి, జల హారతి వద్ద ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ పరిశీలించి త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.*

– *ఈ కార్యక్రమంలో కళ్యాణదుర్గం, గుంతకల్లు ఆర్డీఓలు వసంతబాబు, ఆర్బిఎస్కె శ్రీనివాస్, తాడిపత్రి ఏఎస్పి రోహిత్ చౌదరి, ఏఆర్ ఎస్పి ఇలియాజ్ భాష, ట్రైన్ ఐపీఎస్ అశ్విన్ మనిదీప్, ఎస్డీసి రామ్మోహన్, ఫారెస్ట్ సెటిల్మెంట్ అధికారి రామకృష్ణారెడ్డి, ఐ.అండ్.పీఆర్ డిఐపిఆర్ఓ బాలకొండయ్య, జిల్లా ఫైర్ అధికారి శ్రీనివాస్ రెడ్డి, ఆర్.అండ్.బి ఎస్ఈ మురళీకృష్ణ, ఆర్.అండ్.బి ఈఈ రాజగోపాల్, డిఎల్డివో విజయలక్ష్మి, సివిల్ సప్లై డిఎం రమేష్ రెడ్డి, డిపిఓ మరియు జడ్పి సిఈఓ నాగరాజు నాయుడు, చేనేత జోలి శాఖ ఏడి వరప్రసాద్, ఆర్.డబ్ల్యు.ఎస్ ఎస్ఈ సురేష్, సిఐలు శివగంగాధర్ రెడ్డి, రామసుబ్బయ్య, శ్రీనివాస్, ఎస్డిసిఐలు క్రాంతి, ధరణి, ఎన్ఐసి డిఐఓ భారతి, తహసీల్దార్లు, ఆయా శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.*

Posted Under AP
Editor