Latest Posts

కదిరిలో ప్రైవేట్ ఆసుపత్రి నిర్లక్ష్యం: గర్భిణి మృతితో బంధువుల ఆందోళన, సాయినాథ్ హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత!

శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో విషాదకర ఘటన కలకలం రేపుతోంది.
ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గర్భిణి వాణి మృతి చెందడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.
బంధువుల కథనం ప్రకారం…
బుధవారం, ఒకటో తారీకు వాణిని కదిరిలోని సాయినాథ్ ప్రైవేట్ హాస్పిటల్‌లో చేర్పించారు.
చికిత్స కొనసాగుతున్న సమయంలో ఆమె ఆరోగ్యం విషమించినప్పటికీ, సరైన చికిత్స అందించలేదని ఆరోపిస్తున్నారు.
ఇక గురువారం, రెండో తారీకు వాణి మృతి చెందినట్లు చెబుతున్నారు.
అయితే, ఇప్పటికే మృతి చెందిన తర్వాతే బెంగళూరుకు రిఫర్ చేశారని కుటుంబ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.
హాస్పిటల్ నిర్లక్ష్యం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని ఆరోపిస్తూ…
మృతురాలికి న్యాయం చేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ ఘటనతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా…
బంధువులు ధర్నాకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.

Posted Under AP
Editor