Latest Posts

శ్రీ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి గిరి ప్రదక్షిణ: భక్తులకు మజ్జిగ, ప్రసాద వితరణ చేసిన సేవా సమితి సభ్యులు!

*మనసున తలచినంతనే మోక్షం ప్రసాదించే దేవదేవుడు శ్రీ ఖాద్రీ లక్ష్మీ నారసింహుడు – శ్రీ ఖాద్రీ లక్ష్మీ నృసింహ సేవా సమితి సభ్యులు లక్ష్మణ కుటాల.*

*ప్రహ్లాద సమేతంగా స్వయంభువుగా వెలసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ మత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారు కాటమ రాయుడుగా కొండల లక్ష్మీ నారసింహుడుగా వెలసిన స్తోత్రాద్రికి ప్రతినెలా శ్రీ వారి జన్మ నక్షత్రం సందర్భంగా స్తోత్రాద్రికి ప్రత్యేక హారతులు ఇచ్చిన అనంతరం గోవింద నామస్మరణతో శ్రీ వారి స్తోత్రాద్రి గిరి ప్రదక్షిణలో పాల్గొన్న భక్తాదులు.శ్రీ వారి గిరి ప్రదక్షిణలో పాల్గొంటున్న భక్తాదులకు శ్రీ ఖాద్రీ లక్ష్మీ నృసింహ సేవా సమితి సభ్యులు మంచినీరు , మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేస్తున్నారు.ఆలయ అధికారులు శ్రీ మత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయం తరపున ప్రసాదాన్ని భక్తాదులకు అందించడం జరుగుతూ వస్తోంది. కదిరి పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖులు కదిరి కొండ వద్ద దుద్దే జనార్ధన్ అన్న మరియు వారి మిత్ర బృందం మహాప్రసాద వితరణ చెయ్యడం జరిగింది వారికి ఆ ఖాద్రీ లక్ష్మీ నృసింహ సేవా సమితి తరపున కృతజ్ఞతలు. శ్రీ వారి గిరిప్రదక్షిణలో పాల్గొంటున్న భక్తాదులకు ఆలయ అధికారులు,ప్రభుత్వ అధికారులు సాధ్యం అయినంత తొందరగా కదిరికొండ చుట్టూ గిరి ప్రదక్షిణకు అనుకూలంగా రహదారి నిర్మించాలని శ్రీ వారి భక్తులు కోరుకుంటున్నారు.*

Posted Under AP
Editor