Latest Posts

బడ్జెట్ అంకెల గారడీ కాదు.. సామాన్యుడికి అర్థమయ్యేలా ఉండాలన్న మంత్రి పయ్యావుల కేశవ్

అనంతపురం జిల్లా, కలెక్టరేట్.

*బడ్జెట్‌లో కేటాయించే ప్రతి రూపాయిని ఎక్కడ, ఎలా ఖర్చు చేయాలనే దానిపై స్పష్టమైన ప్రణాళిక ఉండాలి*

– *: బడ్జెట్ అనేది సామాన్య ప్రజలకు, అధికారులకు అర్థమయ్యే సరళమైన భాషలో ఉండాలి*

– *: రాష్ట్రానికి ఆదాయం తక్కువున్నా అభివృద్ధి, సంక్షేమంలో ఎలాంటి కాంప్రమైజ్ కాలేదు*

– *: ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టులపై దృష్టి సారించి వాటిని నిర్ణీత సమయంలో పూర్తి చేయడమే లక్ష్యం*

– *: గత ప్రభుత్వం దాదాపు 90 కేంద్ర ప్రభుత్వ పథకాలను నిలివేయగా.. కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు మళ్లీ 85 పథకాలను పునరుద్ధరించాం..*

– *: ప్రభుత్వ యంత్రాంగం సమన్వయంతో పనిచేసి, రాష్ట్ర అభివృద్ధికి మరియు ప్రజల సంక్షేమానికి తోడ్పడాలి*

– *: రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్..*

– *: అనంతపురం కలెక్టరేట్‌లో “బడ్జెట్ 2026-27 అవుట్‌రీచ్ కార్యక్రమం”*

– *: కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్, ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు, అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి రోనాల్డ్ రాస్, జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్, తదితరులు..*

అనంతపురం, ఏప్రిల్ 03 :

– *బడ్జెట్‌లో కేటాయించే ప్రతి రూపాయిని ఎక్కడ, ఎలా ఖర్చు చేయాలనే దానిపై స్పష్టమైన ప్రణాళిక ఉండాలని, ఆయా శాఖలకు సంబంధించిన బడ్జెట్ ను వివరణాత్మకంగా రూపొందించాలని రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ ఆదేశించారు.*

– *అనంతపురం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో శుక్రవారం “బడ్జెట్ 2026-27 అవుట్‌రీచ్ కార్యక్రమం” నిర్వహించగా, కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్, ప్రభుత్వ విప్ మరియు రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు, అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి రోనాల్డ్ రాస్, జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్, తదితరులు పాల్గొన్నారు.*

– *ఈ సందర్భంగా మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ రూపకల్పన మరియు దాని అమలులో పారదర్శకత కోసం ఈ “బడ్జెట్ అవుట్‌రీచ్ ప్రోగ్రామ్” అనే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారన్నారు. గత 30 ఏళ్ల రాజకీయాల్లో బడ్జెట్ తయారీ విధానంలో వచ్చిన మార్పులను ప్రస్తావించారు. బడ్జెట్ అనేది సామాన్య ప్రజలకు, అధికారులకు అర్థమయ్యే సరళమైన భాషలో ఉండాలని, అది కేవలం అంకెల గారడీగా ఉండకూడదన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు 58 శాతం జనాభా వచ్చినప్పటికీ, ఆదాయం మాత్రం 45-46 శాతం మాత్రమే దక్కిందన్నారు. ప్రధాన ఆదాయ వనరు అయిన హైదరాబాద్ వంటి నగరం పక్కకు వెళ్లడం వల్ల ఇండస్ట్రీ మరియు సర్వీస్ సెక్టార్లు తగ్గి, వ్యవసాయ రంగంపై భారం పెరిగిందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం దాదాపు 90 కేంద్ర ప్రభుత్వ పథకాలను నిలిపివేయడం వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నదని, ఇప్పుడు మళ్లీ 85 పథకాలను పునరుద్ధరించామని చెప్పారు. బడ్జెట్‌లో కేటాయించే ప్రతి రూపాయిని ఎక్కడ, ఎలా ఖర్చు చేయాలనే దానిపై స్పష్టమైన ప్రణాళిక ఉండాలని అధికారులను ఆదేశించారు. గతంలో మాదిరిగా అన్ని ప్రాజెక్టులకు కొద్దికొద్దిగా నిధులు కేటాయించడం కాకుండా, ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టులపై దృష్టి సారించి వాటిని నిర్ణీత సమయంలో పూర్తి చేయడమే లక్ష్యమని చెప్పారు. గత బడ్జెట్‌లో హంద్రీ-నీవా కాలువ పనులను 100 రోజుల్లో పూర్తి చేయడం ద్వారా చివరి ఆయకట్టు వరకు నీరు అందించగలిగామని, అదే స్ఫూర్తితో వెలిగొండ వంటి మేజర్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. ప్రజలు ఇప్పుడు కేవలం శంకుస్థాపనలు చూసి సంతోషపడటం లేదని, పని పూర్తయి ఫలితం అందినప్పుడే సంతృప్తి చెందుతున్నారన్నారు. ప్రభుత్వ యంత్రాంగం అంతా సమన్వయంతో పనిచేసి, రాష్ట్ర అభివృద్ధికి మరియు ప్రజల సంక్షేమానికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత, ఉమ్మడి రాష్ట్రానికి ప్రధాన ఆర్థిక వనరుగా ఉన్న హైదరాబాద్ నగరం తెలంగాణకు వెళ్లడం వల్ల ఆంధ్రప్రదేశ్ ఆదాయం గణనీయంగా తగ్గిందని, విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ కు 58 శాతం జనాభా వచ్చినప్పటికీ, ఆదాయ వనరులు మాత్రం కేవలం 42 శాతం మాత్రమే లభించాయని, ఈ అసమతుల్యత రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపిందన్నారు. విభజన సమయంలో 24 శాతంగా ఉన్న వ్యవసాయ రంగం వాటా, ప్రస్తుతం 31 శాతానికి పెరిగిందని, వ్యవసాయం వల్ల సంపద పెరిగినప్పటికీ, అది పన్ను మినహాయింపు రంగం కావడంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి అది నేరుగా తోడ్పడటం లేదన్నారు. పరిశ్రమల రంగం వాటా సుమారు 25 శాతంగా ఉందని, సేవా రంగంలో ఐటి, రియల్ ఎస్టేట్, హాస్పిటాలిటీ వంటి రంగాలు ఉంటాయని, ఈ రంగం అభివృద్ధి చెందితేనే మల్టిప్లయర్ ఎఫెక్ట్ ద్వారా రాష్ట్ర ఆదాయం పెరుగుతుందని, గత రెండేళ్లలో ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల ఈ రంగం వాటా 42 శాతం నుండి 43 కి పెరిగిందన్నారు. క్షేత్రస్థాయిలో పనిచేసే అధికారులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అవగాహన చేసుకోవడం ద్వారా, వనరుల వినియోగం మరియు అభివృద్ధి ప్రణాళికలను మెరుగ్గా రూపొందించవచ్చని పేర్కొన్నారు.*

– *బడ్జెట్ అనేది కేవలం రాజధానిలో రూపొందించేది కాదని, క్షేత్రస్థాయి అవసరాలకు అనుగుణంగా ఉండాలని ఈ ప్రక్రియను చేపట్టామన్నారు. బడ్జెట్ ప్రతిపాదనలు ఎలా పంపాలో, శాఖల్లో ఏం జరుగుతుందో అందరికీ అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ఉద్దేశం అన్నారు. ప్రభుత్వ నిధులు మన సొంత డబ్బు లాంటివని, వాటిని పాలు, నీళ్లు, ఇల్లు వంటి వ్యక్తిగత ఖర్చుల మాదిరిగానే ఎంతో బాధ్యతగా మరియు సమర్థవంతంగా ఖర్చు చేయాలని సూచించారు. పెట్టిన ప్రతి రూపాయికి తగిన ప్రయోజనం ప్రజలకు కళ్ళముందు కనిపించాలని, సంప్రదాయ పద్ధతుల నుండి మారి రిజల్ట్ ఓరియంటెడ్ గా పని చేయాలన్నారు. గతంలో ఆగిపోయిన సుమారు 85 కేంద్ర పథకాలను తిరిగి ప్రారంభించామని, నిధులను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఢిల్లీలో ఒక ఐఏఎస్ అధికారి మరియు నలుగురు నిపుణులతో ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేశామని, వీరు కేంద్రం నుండి రావాల్సిన ప్రతి రూపాయిని వదలకుండా ఫాలో-అప్ చేస్తారన్నారు. తమిళనాడు రాష్ట్రం కేంద్ర నిధులను చాలా సమర్థవంతంగా వాడుకుంటోందని, మనం కూడా అదే పద్ధతిలో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 50 ఏళ్ల కాలపరిమితి గల వడ్డీ లేని రుణాలను (SASCI) గరిష్టంగా వినియోగించుకోవాలని నిర్ణయించారని, ఇది రాష్ట్ర అభివృద్ధికి గొప్ప అవకాశమని వివరించారు. ఉద్యోగులు కేవలం జీతం కోసం కాకుండా, తమ 20-30 ఏళ్ల అనుభవంతో వినూత్న ఆలోచనలు చేయాలని కోరారు. పారదర్శకతను పెంచడం ద్వారా బడ్జెట్‌ను సామాన్య ప్రజలకు మరింత చేరువ చేయడమే ప్రభుత్వ లక్ష్యం అని పేర్కొన్నారు.*

– *తుంగభద్ర డ్యామ్ గేటు కొట్టుకుపోతే యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేశామని, డ్యామ్ పరిస్థితిని స్టడీ చేస్తే గేట్లు పనికిరావు అని అర్థమైందని, ఒక్క సీజన్‌లోనే ఎంతో ఎఫెక్టివ్‌గా ప్లాన్ చేసుకున్నామని, మూడే మూడు నెలల్లో గేట్లు తీయడం, కొత్తవి పెట్టడం 50 శాతం అయిపోయిందని, మిగతా 50 శాతం కూడా పూర్తవుతుందని, ప్రణాళిక ఉంది కాబట్టే టెండర్లు పిలవడం, డబ్బులు శాంక్షన్ కావడం, వర్క్ ఎగ్జిక్యూట్ అవ్వడం.. అన్నీ మూడు నెలల్లో జరిగాయని, సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆ సపోర్ట్ మాకు ఇస్తున్నారు, రైతుల విషయంలో ‘గో ఆల్ అవుట్’ అనే సపోర్ట్ ఉంది కాబట్టే చేయగలిగాం. మీరు కూడా ఆ కమిట్‌మెంట్‌ను స్ఫూర్తిగా తీసుకుంటే, ఈ జిల్లా చరిత్రను రాష్ట్రంలో మనం ఎలా మారుస్తున్నామో, ఇక్కడి పరిస్థితులను కూడా మార్చగలరన్నారు.*

– *రాయలసీమలో హార్టికల్చర్ హబ్ (Horticulture Hub) ప్లాన్ చేశామని, అది ఇప్పుడు రియాలిటీ అవుతోందని, బడ్జెట్ పెట్టిన మూడవ రోజే తాను ఢిల్లీకి వెళ్ళానని, అప్పుల కోసం కాదు, డెవలప్‌మెంట్ కోసం వెళ్ళానన్నారు. రాయలసీమలో ఉన్న 80 శాతం ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఫండింగ్ పొందుతున్నామని, దాంతో పాటు డ్రిప్, స్ప్రింక్లర్లు, కోల్డ్ స్టోరేజీలు ప్లాన్ చేస్తున్నామని, ప్రైవేట్ కంపెనీలను కూడా తీసుకువస్తున్నామన్నారు.*

– *రాయలసీమ జిల్లాల్లో హార్టికల్చర్ హబ్ మీద సుమారు 30 నుండి 40 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నామని, ఇది ఒక ఎకనామిక్ చైన్ రియాక్షన్ కాబోతోందన్నారు. ఉత్తరాంధ్రలో విశాఖ ఎకనామిక్ రీజియన్, తిరుపతి, అమరావతి ఎకనామిక్ రీజియన్లు ఏర్పాటు చేశామని, ఎకానమీని డ్రైవ్ చేయడానికి ముందుకు వెళ్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వంతో కలిసి అమరావతిని రాజధానిగా నిర్మిస్తున్నామని, రాజధాని అంటే కేవలం అమరావతికి సంబంధించింది కాదని, అనంతపురంలో ఉన్న కుర్రాడికి, శ్రీకాకుళంలో ఉన్న కుర్రాడికి అక్కడ ఉద్యోగ అవకాశాలు లభించాలని, మనకు ఒక ఎకనామిక్ గ్రోత్ ఇంజిన్ కావాలన్నారు. ఇవాళ హైదరాబాద్ ఒక్కటే లక్ష కోట్లకు పైగా ఆదాయాన్ని ఇస్తోందని, తెలంగాణా ఆదాయంలో 78 శాతం హైదరాబాద్ నుండే వస్తోందని, మనం కొత్త ఎకనామిక్ గ్రోత్ ఇంజిన్లను క్రియేట్ చేయాలన్నారు. ప్రభుత్వం చెప్పే కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలన్నారు.*

– *ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన 22 నెలల్లో అనేక ఆర్థిక ఇబ్బందులను అధిగమించి, జీతాలు మరియు పెన్షన్లను సక్రమంగా అందిస్తోందన్నారు. ఈ ఏడాది సంక్షేమం కోసం 2,537 కోట్లు ఖర్చు చేస్తున్నారని, ఇందులో ఎన్టీఆర్ భరోసా, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, దీపం, స్త్రీశక్తి మరియు ఆటో డ్రైవర్ల సేవల వంటి పథకాలు ఉన్నాయన్నారు. జిల్లా అభివృద్ధి పనుల కోసం దాదాపు ₹6,003 కోట్లు వెచ్చిస్తున్నారన్నారు. తుంగభద్ర డ్యామ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకే సీజన్‌లో 33 గేట్లను మార్చడం ఒక అద్భుతమన్నారు. 1958లో ఏర్పాటు చేసిన ఈ గేట్లు 60 ఏళ్లకు పైగా సేవలు అందించాయని, అవి పూర్తిగా తుప్పు పట్టిపోయిన స్థితిలో ఉన్నాయని, గుజరాత్‌కు చెందిన ఒక ప్రముఖ సంస్థ ఈ పనులను అత్యంత వేగంగా పూర్తి చేస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుగా నిధులు విడుదల చేయగా, తర్వాత కేంద్ర ప్రభుత్వం పన్నుల రూపంలో వీటిని సర్దుబాటు చేస్తుందని వివరించారు. మొత్తానికి, రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వ సహకారంతో జిల్లాలో మునుపెన్నడూ లేని విధంగా అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ జిల్లాలకు మేలు చేసే ప్రాజెక్టులను నిర్మించారని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని పేర్కొన్నారు. ఈ ఏడాది జిల్లా అభివృద్ధి కోసం దాదాపు ₹6,000 కోట్లు ఖర్చు చేయబోతున్నామని, ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రామ్‌ల కింద ₹2,537 కోట్లు కేటాయించామని చెప్పారు. ప్రాథమిక అంచనాల ప్రకారం జిల్లాలో మొత్తం ₹8,545 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. ఐసీడీఎస్ (ICDS) మరియు విద్యా, ఆరోగ్య రంగాల్లో జిల్లా వెనుకబడి ఉందని, వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను కోరారు. సామాజికంగా, ఆర్థికంగా జిల్లాను టాప్ లో నిలబెట్టడమే లక్ష్యమని పేర్కొన్నారు. రాయలసీమ హార్టికల్చర్ ప్రాజెక్ట్ ద్వారా ద్వారా సుమారు ₹30,000 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తుందని, మరో ₹70,000 కోట్లు ప్రైవేట్ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. అధికారులందరూ ఒక జట్టుగా పని చేసి, నిధులను క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు అందేలా చూడాలని పిలుపునిచ్చారు.*

– *ఈ సందర్భంగా అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడుతూ బడ్జెట్ 2026-27 అవుట్‌రీచ్ కార్యక్రమం గురించి నియోజకవర్గాల్లో కూడా సమావేశంలో నిర్వహించాలన్నారు. బడ్జెట్ పై అందరికీ అవగాహన కల్పించాలని కోరారు.*

– *ఆర్థిక శాఖ కార్యదర్శి రోనాల్డ్ రాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధానంగా నాలుగు వనరుల ద్వారా ఆదాయం లభిస్తుందని, ఎక్సైజ్ సుంకం, జిఎస్‌టి (GST), మైనింగ్, రిజిస్ట్రేషన్లు ద్వారా ఆదాయం వస్తుందన్నారు. రాష్ట్ర సొంత ఆదాయంలో దాదాపు 99 శాతం కేవలం ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు మరియు పెన్షన్లకే సరిపోతోందన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, ప్రభుత్వం అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలపై దృష్టి పెడుతోందన్నారు. ప్రతి రూపాయిని ప్రజలకు ఉపయోగపడేలా, ఫలితాల ఆధారితంగా ఖర్చు చేయాలని అధికారులకు సూచించారు. రాష్ట్ర ప్రొఫైల్ గురించి తెలియజేశారు.*

– *ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ మాట్లాడుతూ జిల్లా ప్రొఫైల్ గురించి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు బడ్జెట్ 2026-27 అవుట్‌రీచ్ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలో 50 శాఖల వారిగా కేటాయించిన బడ్జెట్ వివరాలను, సూపర్ సిక్స్ కు కేటాయించిన బడ్జెట్ ను వివరించారు. ఆయా శాఖలు కేటాయించిన బడ్జెట్ ను 100 శాతం చేరుకోవాలని ఆదేశించారు.*

– *ఈ సమావేశంలో డిఆర్ఓ ఏ.మలోల, సిపిఓ అశోక్ కుమార్, నగర పాలక సంస్థ కమిషనర్ జస్వంత్ రావు, ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ శేషాద్రి శేఖర్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ సురేష్, ఎస్డీసి ఆనంద్, డిపిఓ నాగరాజునాయుడు, సమగ్ర శిక్ష ఏపిసి శైలజ, ట్రెజరీ డిడి రమణయ్య, బీసీ వెల్ఫేర్ డిడి ఖుష్బూ కొఠారి, జిల్లా వ్యవసాయ అధికారి రవి, పశు సంవర్ధక శాఖ జెడి ప్రేమ్ చంద్, వికలాంగుల సంక్షేమ శాఖ ఎడి అర్చన, జిల్లా టూరిజం అధికారి జయకుమార్ బాబు, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి శ్రీనివాస యాదవ్, చేనేత జౌళి శాఖ ఎడి వరప్రసాద్, డిఎంహెచ్ఓ డా.ఈబి.దేవి, డిఈఓ ప్రసాద్ బాబు, ఎల్డిఎం నరేష్ రెడ్డి, ఉద్యాన శాఖ డిడి ఉమాదేవి, డిఎండబ్ల్యుఓ రామసుబ్బారెడ్డి, హౌసింగ్ పిడి శైలజ, డిసిఓ అరుణకుమారి, ఐసిడిఎస్ పిడి శ్రీదేవి, ఆయా శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.*

Posted Under AP
Editor