అనంతపురం జిల్లా, కలెక్టరేట్.
*జిల్లాలో గార్మెంట్ పరిశ్రమలను ఏర్పాటు చేయాలి*
– *: పరిశ్రమల ద్వారా వేలాది మందికి ఉపాధి కల్పించాలి*
– *: అవసరమైన భూములు కేటాయిస్తాం*
– *: రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్..*
అనంతపురం, ఏప్రిల్ 03 :
– *అనంతపురం జిల్లాలో గార్మెంట్ పరిశ్రమలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. శుక్రవారం అనంతపురం కలెక్టరేట్ లోని ఎన్ఐసి భవనం నుంచి గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ కు చెందిన అరవింద్ గ్రూప్ గార్మెంట్స్ ప్రతినిధులతో అనంతపురం జిల్లాలో గార్మెంట్ పరిశ్రమలు ఏర్పాటు చేసి అంశంపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ సమావేశం నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్, తదితరులు పాల్గొన్నారు.*
– *ఈ సందర్భంగా మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో గార్మెంట్ పరిశ్రమలు ఏర్పాటు చేయాలని అరవింద్ గ్రూప్ గార్మెంట్స్ ప్రతినిధులను ఆహ్వానించారు. గార్మెంట్ పరిశ్రమలను ఏర్పాటు చేయడం ద్వారా వేలాది మందికి ఉపాధి లభించడం జరుగుతుందన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూములను ప్రభుత్వం నుంచి కేటాయించడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకువచ్చేందుకు, పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు అన్ని రకాలుగా కృషి చేయడం జరుగుతోందన్నారు. జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేయడం ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని, ప్రభుత్వం నుంచి అన్ని విధాల సహాయ సహకారం అందిస్తామన్నారు. ఈ సందర్భంగా పరిశ్రమలు ఏర్పాటుపై అరవింద్ గ్రూప్ ప్రతినిధులతో చర్చించారు.*
– *ఈ వీడియో కాన్ఫరెన్స్ లో డిఆర్ఓ ఏ.మలోల, ఆర్డీఓ కేశవనాయుడు, ఏపీఐఐసి జెడ్ఎం నాగకుమార్, తదితరులు పాల్గొన్నారు.*
