Latest Posts

అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి: పార్లమెంట్‌లో అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ విజ్ఞప్తి

న్యూఢిల్లీ.

*అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులకు టెట్ (TET) నుంచి మినహాయింపు ఇవ్వాలని పార్లమెంట్‌లో అంబికా లక్ష్మీనారాయణ విజ్ఞప్తి.*

*విద్యా హక్కు చట్టంలో సవరణలు చేయాలని కేంద్రాన్ని కోరిన ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ*

– అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ పార్లమెంట్‌లో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న టెట్ (TET) సమస్యపై కేంద్ర ప్రభుత్వ దృష్టి తీసుకువచ్చారు.

– ఈరోజు పార్లమెంట్ లో ఆయన మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు తప్పనిసరిగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) ఉత్తీర్ణులు కావాలని, రెండు సంవత్సరాల్లోపు ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించని వారు తమ ఉద్యోగ అర్హతను కోల్పోతారని విద్యా హక్కు చట్టం (RTE) ప్రకారం ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని తెలిపారు.

– దాదాపు 30 నుంచి 40 సంవత్సరాల అనుభవం కలిగిన సీనియర్ ఉపాధ్యాయులు కూడా ఇప్పుడు టెట్ పరీక్ష రాయాల్సిన పరిస్థితి ఏర్పడిందని, దీనివల్ల వారి ఉద్యోగ భద్రతపై తీవ్ర ఆందోళన నెలకొంటోందని ఆయన పేర్కొన్నారు.

– అలాగే, విద్యా హక్కు చట్టం అమల్లోకి రాకముందే డీఎస్సీ (DSC) ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌లోని ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయని అంబికా లక్ష్మీనారాయణ వివరించారు.

– ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించాలంటే 2009 నాటి విద్యా హక్కు చట్టంలో తగిన సవరణలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

– కావున ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న ఈ కీలక సమస్యను కేంద్ర ప్రభుత్వం గమనించి, విద్యా హక్కు చట్టంలో అవసరమైన సవరణలు చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని లోక్‌సభ వేదికగా అంబికా లక్ష్మీనారాయణ గారు ప్రభుత్వాన్ని కోరారు.

Posted Under AP
Editor