ముదిగుబ్బ ఎంఎల్ఎస్ పాయింట్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జేసీ మౌర్య భరద్వాజ్

ముదిగుబ్బ మండలంలోని MLS (మండల స్థాయి స్టాక్) పాయింట్‌ను అకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. మౌర్య భరద్వాజ్

ఈ సందర్భంగా ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు.

గోడౌన్‌లో నిల్వ ఉంచిన బియ్యం మరియు ఇతర నిత్యావసర సరుకుల నాణ్యతను జాయింట్ కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. రికార్డుల్లో ఉన్న నిల్వలకు, వాస్తవంగా ఉన్న సరుకులకు మధ్య తేడాలు ఉండకూడదని అధికారులను ఆదేశించారు. స్టాక్ రిజిస్టర్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
రేషన్ బియ్యం పంపిణీలో ఎక్కడా అక్రమాలకు తావులేకుండా చూడాలని, లబ్ధిదారులకు సకాలంలో సరుకులు అందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.గోడౌన్ ఆవరణను శుభ్రంగా ఉంచుకోవాలని మరియు సరుకులు పాడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.

ఈ తనిఖీలో స్థానిక రెవెన్యూ అధికారులు మరియు పౌర సరఫరాల శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

Posted Under AP
Editor