Latest Posts

ఇంచు కూడా అమరావతిని కదిలించలేరు: వింజమూరు ‘పేదల సేవలో’ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు

నెల్లూరు జిల్లా.

*ఇంచు కూడా అమరావతిని కదిలించలేరు సీఎం చంద్రబాబు.

వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీపై సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని విధ్వంసం చేసి ఆనందించారని మండిపడ్డారు.

వింజమూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడ పర్యటన కొనసాగుతోంది. వింజమూరులో నిర్వహించిన ‘పేదల సేవలో’ కార్యక్రమంలో సీఎం పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వైసీపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘నా జీవితంలో వైసీపీ లాంటి పార్టీని, జగన్ లాంటి వ్యక్తిని చూడలేదు’ అని అన్నారు. మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని విధ్వంసం చేసి ఆనందించారని మండిపడ్డారు. అమరావతి తీర్మానం రోజున వైసీపీ సభ్యులు అసెంబ్లీకి రాలేదన్నారు. అమరావతి ఏకైక ప్రజా రాజధాని అని… ఇక ఇంచు కూడా ఎవ్వరూ కదిలించలేరని స్పష్టం చేశారు. అమరావతికి చట్టబద్ధత తీర్మానంపై లోక్‌సభలో చర్చ జరుగుతోందని… ఆమోదం పొంది రేపు(గురువారం) రాజ్యసభకు వెళుతుందని సీఎం తెలిపారు.
ఈ ఏడాదిలో వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తి చేసి ఉదయగిరికి కూడా నీరిస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ‘నాపై కోపంతో పోలవరం ప్రాజెక్ట్‌ను గోదావరిలో కలిపేశారు. గోదావరి పుష్కరాల లోపు పోలవరం పూర్తి చేస్తాం. శ్రీశైలం, పోలవరంతో ఉదయగిరి ప్రాంతానికి నీటి కొరత ఉండదు’ అని అన్నారు. పేదల జీవన ప్రమాణాలు పెరగడం లేదని.. అందుకే P4 ప్రవేశపెట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.
ఒకటో తేదీ వస్తే పేదలే గుర్తొస్తారని.. దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా ఫించన్లు పంపిణీ చేస్తున్నామని ముఖ్యమంత్రి అన్నారు. 63 లక్షల మందికి ఫించన్లు ఇస్తున్నామన్నారు. ఫించన్లను మొక్కుబడిగా ఇవ్వడం లేదని… గౌరవంగా ఇంటి వద్దే ఇచ్చే కార్యక్రమం చేపట్టామని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఫించన్లు, తల్లికి వందనం ఇచ్చామని తెలిపారు. స్త్రీశక్తి సూపర్ సక్సెస్ అయిందని.. ఆడబిడ్డలు దర్జాగా ఎక్కడికి వెళ్లాలంటే అక్కడికి వెళుతున్నారని తెలిపారు. ‘మా ఆడబిడ్డల కోసం దీపం కింద ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం. ఇప్పుడు మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. పీఎంజీ కనెక్షన్ తీసుకున్నా.. ఏడాదికి రూ.2,465లు సబ్సిడీ ఇస్తాం’ అని ముఖ్యమంత్రి వెల్లడించారు.

Posted Under AP
Editor