Latest Posts

సిద్దరాంపురంలో పింఛన్ల పంపిణీ: నేతన్నల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట – పూల నాగరాజు

అనంతపురం జిల్లా,శింగనమల.

నేతన్నల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది

వెయ్యి రూపాయిలు పింఛన్ పెంచేందకు జగన్ రెడ్డికి ఐదేళ్లు పట్టింది.. టిడిపి జిల్లా అధ్యక్షుడు, ఆర్టీసీ జోనల్ చైర్మన్ పూల నాగరాజు గారు

*శింగనమల నియోజకవర్గం సిద్దరాంపురం గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ, పూల నాగరాజు *

దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకు మాత్రమే దక్కుతుందని అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆర్టీసీ జోనల్ చైర్మన్ పూల నాగరాజు తెలిపారు. సింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలంలోని సిద్దరాంపురం గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ గారితో పూల నాగరాజు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎడిసిసి బ్యాంక్ చైర్మన్ ముంటిమడుగు కేశవరెడ్డి , టిడిపి రాష్ట్ర కార్యదర్శి ఆలం నరసానాయుడు , టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్ చౌదరి , టిడిపి రాష్ట్ర కార్యనిర్వాస కార్యదర్శి, సముద్రం మాజీ జెడ్పిటిసి సభ్యుడు రామలింగారెడ్డి , టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నాయకులతో కలిసి లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛలను పూల నాగరాజు గారు అందజేశారు. ఈ సందర్భంగా పూల నాగరాజు గారు మాట్లాడుతూ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో పింఛన్ల పంపిణీ జరుగుతోందన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి 2వేల నుంచి 3వేల రూపాయలు పెంచేందుకు ఐదేళ్ల సమయం తీసుకున్నారన్నారు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం తొలి 5 సంతకాల్లోనే పింఛన్ పెంపుపై చేశారన్నారు. 3వేల ఉన్న పింఛన్ ను నుంచి 4వేలకు పెంచారన్నారు. వైసీపీ హాయంలో ఎక్కడా ఎప్పుడు పింఛన్లు ఇస్తారో తెలుసే పరిస్థితి ఉండదన్నారు. కానీ ఈ రోజు 1వ తేదీన ఇంటి తలుపు తట్టు మరి అందిస్తున్నారన్నారు. రాష్ట్రంలో చేనేత పరిశ్రమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందన్నారు. నేతన్నలకు వ్యక్తిగత లబ్ధి కలిగించేలా ఒకవైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే, మరో పరిశ్రమ అభివృద్ధికి పాలసీలు తీసుకువచ్చిందన్నారు. ఆనాడు అన్న ఎన్టీఆర్ గారు కూడు, గూడు, గుడ్డ నినాదంతో చేనేత రంగానికి అండగా నిలిచారు. ఆయన స్ఫూర్తితో పాలన సాగిస్తున్న సీఎం చంద్రబాబు గారు చేనేత రంగ అభివృద్ధికి ఎన్నో ప్రణాళికలు రూపొందించారన్నారు. నూతన టెక్స్ టైల్స్ పాలసీలు అమలు చేయడం, మెగా క్లస్టర్లు, టెక్స్ టైల్స్ పార్కులు ఏర్పాటు చేయడంతో పాటు నేతన్నలకు వ్యక్తిగత లబ్ధి కలిగేలా సంక్షేమ కార్యక్రమాలను కూటమి ప్రభుత్వం అమలు చేసిందన్నారు. దీనిలో భాగంగానే నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షా నాలుగు వేల చేనేతల కుటుంబాలకు మేలు కలిగే ఉచిత విద్యుత్ పథకానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుడుతోందన్నారు. ఈ పథకం ద్వారా ఏటా రూ.150 కోట్ల భారం ప్రభుత్వంపై పడుతోందని, అయినా చేనేతల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

Posted Under AP
Editor