అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం.
పింఛన్లకు ఆద్యుడు అన్న ఎన్టీఆర్..ఎమ్మెల్యే అమిలినేని
అన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద పింఛన్లు అందిస్తుండటం నా అదృష్టం
అంతా నేనే చేసాను అంటూ రోడ్ల మీద ర్యాలీ చేసి రంగయ్య జోకర్ అయ్యాడు..
మంత్రిగా ఉషా శ్రీ దోచుకుని మరో నియోజకవర్గానికి వెళ్ళిపోయింది..
ఎంపీగా ఉన్న రంగయ్య కనీసం అభివృద్ధి మనకెందుకులే అనుకున్నాడు
ఐదేళ్లు బీటీపీ కాలువలో ఒక గంప మట్టి కూడా తీయలేదు..
వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమంగాలికి వదిలి ఆంధ్రప్రదేశ్ లో అప్పుల కుప్పగా మార్చి పోయారు..
సాగునీళ్లు అందిస్తే ఈ ప్రాంత రైతులు బంగారు పంటలు పండిస్తారు..
ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి సరిగా వృద్దులు, వికలాంగులు, వితంతువులకు పింఛన్లు అందించిన ఘనత అన్న నందమూరి తారక రామరావు గారికే దక్కుతుందని, నేడు దేశంలో అత్యధికంగా పింఛన్లు అందిస్తున్నది మన రాష్ట్రమేనని రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పండుగ జరుగుతోందని అందులోను అన్న ఎన్టీఆర్ విగ్రహం వద్దే పింఛన్లు అందించడం నా అదృష్టమని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు పేర్కొన్నారు..అనంతపురం జిల్లాలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేస్తున్న ఆర్డీటీ సంస్థ రెన్యూవల్ కాకపోవడం వలన కొంత ఇబ్బందులు వచ్చాయని ఇక్కడ జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు యువ నాయకుడు నారా లోకేష్ గారిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి అక్కడి నుంచి కేంద్ర మంత్రుల సహకారంతో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా గారిని కలసి అనంతపురంలో ఆర్డీటీ సంస్థ చేస్తున్న సేవలు తెలియజేయడంతో FCRA రెన్యూవల్ చేశారని అంతే కానీ ఎవరో ధర్నాలు, పాదయాత్రలు చేస్తే రాలేదని, కానీ ఇక్కడ రంగయ్య అంతా నేనే చేసాను అని చెప్పుకుని రోడ్ల మీద ర్యాలీలు చేసుకుని జోకర్ అయ్యాడని అన్నారు..నేడు కుందుర్పి మండలం కృష్ణాపురం, తూమకుంట గ్రామాల్లో పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు గారు విచ్చేయగా గ్రామస్థులు, టీడీపీ నాయకులు పూలవర్షం కురిపించి ఘన స్వాగతం పలికారు.. అనంతరం గ్రామాల్లోని ఎన్టీఆర్, భగీరత, కనకదాసు విగ్రహాలకు పూలమాల వేయడం జరిగింది..ఈ సందర్బంగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు మాట్లాడుతూ గత ప్రభుత్వం ఐదేళ్లు అభివృద్ధి, సంక్షేమాన్ని గాలికి వదిలేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని, ఇక కళ్యాణదుర్గం మంత్రి దందాలు, దోపిడీలు, కబ్జాలతో ఉన్నదంతా దోచుకుని మరో నియోజకవర్గానికి వెళ్ళిపోయిందని, ఇక్కడ రంగయ్య ఎంపీగా ఉన్న రోజుల్లో ఏఒక్క అభివృద్ధి చేయకుండా కనీసం తాగునీటి అవసరాలు కూడా తీర్చలేకపోయారని, ప్రస్తుతం వేసవి కాలం కావడంతో ఎక్కడా కూడా తాగునీటి ఇబ్బంది లేకుండా అవసరం ఉన్న చోట బోర్లు వేయించి నీటిని అందిస్తున్నామని అన్నారు..రెండు గ్రామాల్లోను ఎస్సీ కాలనీల్లో తాగునీటి ఇబ్బందులు ఉన్నాయని వారంలోగా కొత్త బోర్లు వేయించి అక్కడే ట్యాంకులు ఏర్పాటు చేస్తామని, కృష్ణాపురం గ్రామంలో భగీరథ విగ్రహానికి పైకప్పు కోసం 50 వేల రూపాయలు స్వంత నిధులు అందజేశారు..ప్రైమరి పాఠశాలకు తరగతి గది మంజూరు చేస్తామని, చిన్నారులకు క్రికెట్ కిట్, స్కిప్పింగ్ తాళ్ళు వారంలో అందజేస్తామని హామీ ఇచ్చారు.
