Latest Posts

బొమ్మనహాల్‌లో ఇంటింటికీ వెళ్లి పెన్షన్లు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్

అనంతపురం జిల్లా, బొమ్మనహళ్.

లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ల పంపిణీ

– : జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్..

– : బొమ్మనహాల్ మండల కేంద్రంలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్లను పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్..

అనంతపురం, ఏప్రిల్ 01 :

– బొమ్మనహాల్ మండల కేంద్రంలో బుధవారం ఎన్టీఆర్ భరోసా పథకం కింద లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్లను పంపిణీ చేసే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ పాల్గొని స్వయంగా పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో పెన్షన్ వల్ల ఉపయోగం ఉందా, ఒకటవతేదీ పెన్షన్ వస్తోందా, సచివాలయ సిబ్బంది ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ ఇస్తున్నారా, మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా, తదితర వివరాలను ఆరా తీశారు. సచివాలయ సిబ్బంది ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ ఇస్తున్నారని, పెన్షన్ డబ్బులు తమకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని లబ్ధిదారులు సంతృప్తి వ్యక్తం చేశారు.

– ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి నెలా ఒకటవ తేదీన లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్లను పంపిణీ చేయడం జరుగుతోందని, అందులో భాగంగా ఈరోజు పెన్షన్లను పంపిణీ చేస్తున్నామన్నారు. జిల్లాలో సజావుగా పెన్షన్ల పంపిణీ చేపట్టడం జరుగుతోందని తెలిపారు. పెన్షన్ల పంపిణీ పూర్తి స్థాయిలో చేపట్టేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు ప్రజలు పలు సమస్యలను తెలియజేయగా, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

– అనంతరం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులతో, సిబ్బందితో మాట్లాడి వైద్య సేవలు, పనితీరుపై ఆరా తీశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అనంతరం స్థానిక హైస్కూలులో పదవ తరగతి పరీక్షలను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు.

– ఆ తరువాత బొమ్మనహాల్ మండలంలోని కురువల్లి గ్రామంలోని 1, 2 అంగన్ వాడి కేంద్రాలను తనిఖీ చేశారు. అంగన్ వాడి కేంద్రం 2లో పిల్లల వయసుకు తగ్గ బరువు నమోదులో ఆన్లైన్లో తక్కువగా చేయగా, రికార్డులు సక్రమంగా నమోదు చేయడం లేదని సంబంధిత అంగన్వాడి వర్కర్ పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆ తరువాత గ్రామ సచివాలయంలో రైతులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రెవెన్యూ సమస్యలు, జాయింట్ ఎల్పియంల సమస్యలను రైతులు తెలుపగా, వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

– ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మునివేలు, ఎంపిడిఓ విజయభాస్కర్, సర్వేయర్ రవితేజ, సిహెచ్ఓ నాగమల్లేష్, ఆయా శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Posted Under AP
Editor