Latest Posts

లత్తవరంలో ఇంటింటికీ వెళ్లి పెన్షన్లు పంపిణీ చేసి, విద్యార్థులతో కలిసి భోజనం చేసిన మంత్రి పయ్యావుల కేశవ్

అనంతపురం జిల్లా, ఉరవకొండ.

లత్తవరంలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద లబ్ధిదారుల ఇంటివద్దకే వెళ్లి పెన్షన్లను పంపిణీ చేసిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్..

ఉరవకొండ మండలం లత్తవరం గ్రామంలో బుధవారం ఎన్టీఆర్ భరోసా పథకం కింద లబ్ధిదారుల ఇంటివద్దకే వెళ్లి పెన్షన్లను పంపిణీ చేసే కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులను ఆప్యాయంగా పలకరించి వారికి స్వయంగా పెన్షన్లను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా వారితో పలు సమస్యల గురించి అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. అంతకుముందు మంత్రి గ్రామంలోని రామాలయంలో మంత్రి పూజలు చేశారు.

మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి భోజనం చేసిన మంత్రి :

లత్తవరం గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి విద్యార్థులతో కలిసి మంత్రి భోజనం చేశారు.

Posted Under AP
Editor