తాడిమర్రి(yes9tv)తాడిమర్రి పంచాయతీలో వాటర్ హార్వెస్టింగ్ పాండ్ పనుల ప్రారంభం
ఈరోజు వి బి జి రామ్ జి కార్యక్రమంలో భాగంగా తాడిమర్రి పంచాయతీలోని తాటిమాను వంక వద్ద గల శ్రీరాములు పొలంలో వర్షపు నీటి నిల్వ కోసం వాటర్ హార్వెస్టింగ్ పాండ్ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని తాడిమర్రి మండలం ఎంపిడిఓ గారు బీజేపీ మండల కన్వీనర్ రామ్మోహన్, బీజేపీ నాయకుడు చంద్రతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా బీజేపీ కన్వీనర్ రామ్మోహన్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వి బి జి రామ్ జి పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని తెలిపారు. గతంలో NREGS ద్వారా సంవత్సరానికి కేవలం 100 రోజుల పని మాత్రమే కల్పించేవారని, ప్రస్తుతం 125 రోజుల వరకు ఉపాధి కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
అనంతరం ఎంపిడిఓ గారు మాట్లాడుతూ వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని కూలీలు ఉదయం 6 గంటలకే పనులకు హాజరు కావాలని సూచించారు. ఎండలు ఎక్కువయ్యే లోపలే, అనగా ఉదయం 10:30 గంటల లోపు కేటాయించిన పనులను పూర్తి చేయాలని తెలిపారు. అలాగే తగినంత తాగునీరు తీసుకురావాలని, ANM మరియు ఆశా వర్కర్ల ద్వారా ORS పాకెట్లు పొందుకొని పనిస్థలంలో అందుబాటులో ఉంచుకోవాలని FA, TA లకు సూచించారు.
కూలీలు మరియు మేట్లు కొత్తగా ప్రవేశపెట్టిన ఫేస్ ఆథెంటికేషన్ యాప్ ద్వారా హాజరు నమోదు సమయంలో ఎదురవుతున్న సాంకేతిక ఇబ్బందుల గురించి ప్రశ్నించగా, వాటిని సంబంధిత నిపుణులతో చర్చించి త్వరలో పరిష్కరిస్తామని ఎంపిడిఓ గారు హామీ ఇచ్చారు.
అదేవిధంగా పెండింగ్‌లో ఉన్న కూలీల వేతనాలను ప్రభుత్వం విడుదల చేసిందని, రెండు నుంచి మూడు రోజుల్లో కూలీల ఖాతాల్లో జమ అవుతాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో APO అనిల్ కుమార్ రెడ్డి, TAలు అరుణమ్మ, వెంకటకృష్ణ, FAలు గణేష్, వెంకట్రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తాడిమర్రిలో వాటర్ హార్వెస్టింగ్ పాండ్ పనుల ప్రారంభం: ఉపాధి హామీ కూలీలకు అధికారుల కీలక సూచనలు
