Latest Posts

ఆర్‌డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యూవల్ మంజూరు: మోంచో ఫెర్రర్‌ను అభినందించిన మంత్రి సత్యకుమార్ యాదవ్

అనంతపురం జిల్లా.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య మరియు ఆరోగ్యశాఖ మంత్రి వర్యులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు, అనంతపురం జిల్లా అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న ఆర్డీటీ (RDT) సంస్థకు కేంద్ర ప్రభుత్వం FCRA రెన్యూవల్ అనుమతులు మంజూరు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నేడు అనంతపురంలోని మోంచో ఫెర్రర్ గారి నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను ఆత్మీయంగా కలుసుకున్నారు.

గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు, కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా గారు మరియు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రత్యేక చొరవతో ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యూవల్‌కు గ్రీన్ సిగ్నల్ లభించిందని మంత్రి గారు తెలిపారు.

ఈ సందర్భంగా మోంచో ఫెర్రర్ గారు, ఈ సమస్యను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కార దిశగా కృషి చేసిన మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే శ్రీ దగ్గుపాటి ప్రసాద్ గారు, శ్రీ పరిటాల శ్రీరామ్ గారు, బీజేపీ నాయకులు శ్రీ సంధి రెడ్డి శ్రీనివాస్ గారు, శ్రీ ఒంటేరు శ్రీనివాసుల రెడ్డి గారు తదితరులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Posted Under AP
Editor