అనంతపురం జిల్లా,
రాయదుర్గం నియోజకవర్గం, కణేకల్.
పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
పేదల సంక్షేమ ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, రాయదుర్గం శాసనసభ్యులు కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు.అనంతపురం జిల్లా కనేకల్ మండలం పూలచెర్ల గ్రామంలో బుధవారం ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు పెన్షన్లను పంపిణీ చేశారు. గ్రామంలో ఇంటింటికి వెళ్లి వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలకు పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్లతో వృద్ధులు, వికలాంగులు సమాజంలో గౌరవంగా జీవిస్తున్నట్లు తెలిపారు.
ప్రతి నెల ఒకటో తేదీ పేదల పండగ గా మారిందన్నారు.
పెన్షన్లు పొందుతున్న లక్షలాది కుటుంబాలు సుఖసంతోషాలతో జీవిస్తున్నట్లు తెలిపారు. 22 నెలల కాలంలో ప్రభుత్వం దాదాపు రూ. 60 వేల కోట్లు పెన్షన్ల రూపంలో పంపిణీ చేసినట్లు తెలిపారు.
బైట్స్. కాలవ శ్రీనివాసులు, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే, రాయదుర్గం.
