Latest Posts

తాడిమరిలో లక్ష్మీ తారమ చెన్నకేశవ స్వామి ఉత్సవాలపై రాజకీయ వివాదం…. వైఎస్ఆర్సీపీ కౌంటర్ ప్రెస్ మీట్…

తాడిమరి మండల కేంద్రంలో నిర్వహించనున్న శ్రీలక్ష్మి తారమ చెన్నకేశవ స్వామి ఉత్సవాల నేపథ్యంలో రాజకీయ విభేదాలు తలెత్తాయి. ఈ అంశంపై కూటమి నాయకులు సోమవారం నిర్వహించిన ప్రెస్ మీట్‌లో తాడమరి చంద్రశేఖర్ రెడ్డి పై చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా, వైఎస్ఆర్సీపీ నాయకులు మరియు కార్యకర్తలు మంగళవారం తాడిమర్రి మీడియా పాయింట్ వద్ద కౌంటర్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా తాడిమరి మండల వైఎస్సార్ సీపీ నాయకులు మాట్లాడుతూ, తాడిమరి అభివృద్ధికి మాజీ డిసిఎంఎస్ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి చేసిన కృషిని వివరించారు. అలాగే వారి ఆధ్వర్యంలో జరిగిన దానధర్మాలు, ప్రజాహిత కార్యక్రమాలు, ప్రాంత అభివృద్ధికి చేసిన పనులను వివరించారు. కూటమి నాయకులు చేసిన ఆరోపణలు వాస్తవాలకు విరుద్ధమని ఆయన ఖండించారు.
ఈ ప్రెస్ మీట్‌లో పార్టీ మండల కన్వీనర్ ఆర్వేటి రామాంజనేయులు, రామాపురం సర్పంచ్ కుంటాల పుల్లయ్య, మోదుగులకుంట రవి చంద్రారెడ్డి, కాటమయ్య, హనుమంతు, ఎంపీటీసీ చంద్ర, బండారు రాము, విశ్వనాధ్, చింతకాయల రెడ్డప్ప, జిట్టా మల్లికార్జున, నిడిగల్లు ప్రసాదు, గురు ప్రసాద్, నరసింహులు, మద్దిలేటి పెద్దన్న తదితరులు పాల్గొన్నారు

Posted Under AP
Editor