Latest Posts

బొమ్మనహాళ్ దారి దోపిడీ కేసు ఛేదనం: అంతర్రాష్ట్ర మోసగాడు ఓబులేసు సహా ముగ్గురు నిందితుల అరెస్ట్!

అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం

*దారి దోపిడీ కేసును ఛేదించిన బొమ్మనహాళ్ పోలీసులు*

*ముగ్గురు నిందితులు అరెస్టు*

అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని బొమ్మనహాళ్ మండలం నేమకల్ గ్రామ సమీపంలో జరిగిన దారి దోపిడీ కేసును పోలీసులు ఛేదించి ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. రాయదుర్గం రూరల్ సీఐ వెంకటరమణ ఆధ్వర్యంలో బొమ్మనహాళ్ ఇంచార్జ్ ఎస్సై గురు ప్రసాద్ రెడ్డి, కనేకల్ ఎస్సై నాగ మధు బృందం ఆదివారం కనేకల్ మండలం ఎర్రగుంట వద్ద నిందితులను అరెస్టు చేసినట్లు మీడియా సమావేశంలో వెల్లడించారు.
పోలీసుల వివరాల ప్రకారం, నేమకల్ గ్రామానికి చెందిన రైతు బోయ గోవిందు 2026 జనవరి 11న గొర్రెల విక్రయించి రూ.1.50 లక్షల నగదుతో ద్విచక్ర వాహనంలో గ్రామానికి వెళ్తుండగా ముగ్గురు నిందితులు బ్లాక్ స్కార్పియో వాహనంలో వచ్చి కత్తితో బెదిరించి నగదును దోచుకెళ్లారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
అరెస్టు చేసిన నిందితుల్లో గార్లదిన్నె మండలం కొప్పలకొండ గ్రామానికి చెందిన బెస్త ఓబులేసు అలియాస్ మనోహర రెడ్డి, మహేష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, చక్కెర రెడ్డి, పామిడి పట్టణం నెహ్రు నగర్‌కు చెందిన పెరుమాళ్ల రామకృష్ణారెడ్డి, నార్పల మండలం కర్ణపుడి గ్రామానికి చెందిన బెస్త మహేంద్ర ఉన్నారు.
ప్రధాన నిందితుడు ఓబులేసు గత జనవరిలో బొమ్మనహాళ్ మండలం ఉద్దేహాల్ గ్రామంలో హోల్‌సేల్ చక్కెర, ఐటీసీ సిగరెట్లు ఏజెంటుగా వ్యాపారం ప్రారంభించి స్థానికుల నమ్మకాన్ని పొందినట్లు పోలీసులు తెలిపారు. రోజుకు అధిక వడ్డీ చెల్లిస్తానని చెప్పి దాదాపు కోటి రూపాయలకు పైగా అప్పు తీసుకుని అనంతరం పరారైనట్లు వెల్లడించారు. ఉద్దేహాల్ గ్రామంలో సుమారు 30 మంది బాధితుల నుంచి రూ.1 కోటికి పైగా డబ్బులు తీసుకున్నట్లు తెలిపారు.
ఇతనిపై రాష్ట్రవ్యాప్తంగా సుమారు 15 కేసులు ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. సత్యసాయి జిల్లా సోమందేపల్లిలో రూ.4.50 కోట్లు, ప్రకాశం జిల్లాలో రూ.2 కోట్లు, అనంతపురం మరియు సత్యసాయి జిల్లాల్లో దాదాపు రూ.10 కోట్ల మేర ప్రజలను మోసం చేసినట్లు వెల్లడించారు. నిందితుడు గోవా, ఢిల్లీ వంటి ప్రాంతాలకు వెళ్లి తలదాచుకుని విలాసవంతమైన జీవితం గడుపుతూ కొత్త ప్రాంతాల్లో వ్యాపారం పేరుతో మళ్లీ మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు.
ఈ కేసును చాలెంజ్‌గా తీసుకుని నిందితులను అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశపెట్టామని రాయదుర్గం రూరల్ సీఐ వెంకటరమణ తెలిపారు. ప్రజలు అధిక లాభాలు వస్తాయని నమ్మి డబ్బులు ఇవ్వకూడదని, అపరిచితులపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
బైట్స్:
వెంకటరమణ, రాయదుర్గం రూరల్ సీఐ, అనంతపురం జిల్లా.

Posted Under AP
Editor