తాడిమర్రి( yes9tv)తాడిమర్రిలో ఘనంగా టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం
మార్చి 29: తాడిమర్రి మండల కేంద్రంలో తెలుగు దేశం పార్టీ (టీడీపీ) 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ కూచి రాము, సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు గోనుగుంట్ల భూషణ్, తాడిమర్రి హర్ష, పుల్లంపల్లి మాజీ జడ్పిటిసి ఆకులేటి అశ్వత్, పిన్నదరి విశ్వనాథ్, రాగే ఎల్లప్ప, నాయనపల్లి గంగాధర్ తదితర టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించి, పార్టీ అభివృద్ధి, బలోపేతానికి కృషి చేయాలని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో విజయవంతంగా ముగిసింది
తాడిమర్రిలో ఘనంగా టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం..
