Latest Posts

15 ఏళ్ల తర్వాత చిల్లకొండయ్యపల్లిలో వనభోజన గ్రామోత్సవం: అడవిలో విందు.. ఊరంతా పండుగ!

తాడిమర్రి (yes9tv)చిల్లకొండయ్యపల్లి గ్రామంలో 15 సంవత్సరాల తర్వాత వనభోజన గ్రామోత్సవం ఘనంగా నిర్వహణ
ధర్మవరం, మార్చి 29:
తాడిమర్రి మండలంలోని చిల్లకొండయ్యపల్లి గ్రామంలో 15 సంవత్సరాల తర్వాత వనభోజన గ్రామోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఎంతోకాలం తరువాత గ్రామంలో పండుగ వాతావరణం నెలకొనడంతో గ్రామస్తులు ఆనందోత్సాహాలతో పాల్గొన్నారు.
ఉదయాన్నే గ్రామస్తులు పొలాలకు వెళ్లి అడవిలోనే వంటలు చేసుకుని, సాయంత్రం వరకు అక్కడే గడిపారు. భోజనాలు, తొక్కుడుబిళ్ళలు వంటి సంప్రదాయ కార్యక్రమాలతో వేడుకలు సందడిగా సాగాయి. ఈ సందర్భంగా చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఉత్సాహంగా పాల్గొని ఆనందాన్ని పంచుకున్నారు.
అనంతరం గ్రామానికి తిరిగి చేరుకుని స్వామివారికి టెంకాయలు కొట్టి, ఆనవాయితీ ప్రకారం గ్రామ నడిబొడ్డున ఏర్పాటు చేసిన తోరణం కిందుగా గ్రామంలోకి ప్రవేశించారు. తరువాత గ్రామస్తులు తమ తమ ఇళ్లకు వెళ్లారు.
ఈ కార్యక్రమం ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ప్రశాంతంగా, సంతోషకరంగా ముగిసిందని గ్రామ పెద్దలు గోపాల్ రెడ్డి, మద్దినేని శ్రీనివాసులు, కొంకా పోతలయ్య తెలిపారు

Posted Under AP
Editor