‘పది’ మూల్యాంకన పారితోషికం పెంచాలి -వైఎస్ఆర్ టీఏ నేత రెడ్డి శేఖర్ రెడ్డి

 

చిత్తూరు:

పదోతరగతి పబ్లిక్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనానికి చెల్లిస్తున్న పారితోషికం రేట్లను తక్షణమే పెంచాలని వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వి.రెడ్డి శేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. నూతన విధానంలో ట్యాబుల ద్వారా మార్కుల నమోదు ప్రక్రియ కష్టతరంగా ఉందని… దీనికోసం ఉపాధ్యాయులు ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తున్నందున పారితోషికం పెంచాలని విజ్ఞప్తి చేశారు. స్పెషల్ అసిస్టెంట్లకు రోజుకు కనీసం రూ. 500 చెల్లించాలని కోరారు. పాత రేట్లనే అమలు చేయడం సరికాదని పేర్కొన్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా మూల్యాంకన కేంద్రాల్లోని అన్ని గదుల్లో ఫ్యాన్లు, కూలర్లు ఏర్పాటు చేయాలని.. ఉపాధ్యాయులకు చల్లటి తాగునీరు, మజ్జిగ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. స్పాట్ వాల్యుయేషన్ ముగిసిన రోజే ఉపాధ్యాయులకు రెమ్యూనరేషన్ చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

Posted Under AP
Editor