అనంతపురం: స్కూల్ బస్సు దిగగానే బాలుడి కిడ్నాప్
అనంతపురం జిల్లా యాడికి మండలం కోనుప్పలపాడులో బుధవారం కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. స్కూల్ బస్సు దిగి ఇంటికి వెళ్తున్న యూకేజీ విద్యార్థి హేమచంద్రను గుర్తుతెలియని వ్యక్తి బైక్పై కిడ్నాప్ చేశాడు. నిందితుడు ముఖానికి రుమాలు కట్టుకుని, బాలుడికి కుర్కురే ప్యాకెట్లు కొనిచ్చి తీసుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు సీసీ ఫుటేజీని స్వాధీనం చేసుకుని గాలింపు చర్యలు చేపట్టారు.
