, తాడిమర్రి (yes9tv)మండలం లోని ఆత్మకూరు గ్రామంలో ఉచిత పశు వైద్య శిబిరం విజయవంతంగా నిర్వహించబడింది. ఈ శిబిరాన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీ ధర్మవరం ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అంబటి అరుణశ్రీ గారు, అంబటి సతీష్ గారు, డాక్టర్ యూనిస్ గారు, నియోజకవర్గం టీడీపీ బీసీ సెల్ అధ్యక్షులు ఎం. శ్రీనివాసు గారు, మండల బీజేపీ అధ్యక్షులు రామ్మోహన్ గారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
శిబిరంలో గ్రామానికి చెందిన పశుపోషకులు తమ పశువులకు వైద్య పరీక్షలు చేయించుకుని అవసరమైన చికిత్సలు, ఔషధాలు ఉచితంగా పొందారు. వెటర్నరీ వైద్య సిబ్బంది పశువుల ఆరోగ్యంపై అవగాహన కల్పించి, పలు సూచనలు అందించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, రైతులు, పశుపోషకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
తాడిమర్రి మండలం ఆత్మకూరులో ఘనంగా ఉచిత పశు వైద్య శిబిరం: రైతులకు అవగాహన, ఉచితంగా మందుల పంపిణీ
