Latest Posts

ఆర్డీటీకి ఎఫ్.సి.ఆర్.ఏ పునరుద్ధరణ ‘యావత్తు ప్రజా విజయం’: కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మధుసూధన రెడ్డి

—————–
ఆర్ డి టి కి ఎఫ్ సి ఆర్ ఏ పునరుద్ధరణ,కృషికి అభినందనలు!
—————————
60 సంవత్సరములుగా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు,పొరుగు రాష్ట్రాలలో సైతం పేద ప్రజల అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ఆర్డిటి సంస్థకు దాదాపు సంవత్సర కాలంగా ఎఫ్ సి ఆర్ ఏ పునరుద్ధరణ జరగని కారణంగా నిధుల కొరత ఏర్పడి,తీవ్రమైన సంక్షోభం ఎదుర్కొంటున్న సందర్భంలో,ఆ సంస్థ తమ ఆస్తులను అమ్మకానికి పెట్టి,ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్లిపోయే దశలో,ఈ జిల్లాలో గల అన్ని రాజకీయ పార్టీలు,ప్రజాసంఘాలు,దళిత బహుజన సంఘాలు,కుల సంఘాలు,మేధావులు విద్యావంతులు,ఈ సంస్థ అవసరాన్ని,గొప్పతనాన్ని,ఈ ఉద్యమ తీవ్రతను బయట ప్రపంచానికి తెలియజేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా,ఆర్డిటి లబ్ధిదారులు,పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ,ఎవరికి వారు,వారికి తగిన రీతిలో,వివిధ రూపాలలో ప్రాణాలకు సైతం తెగించి పోరాటం చేసారు.చివరికి జిల్లా బంధ్,రాజధాని అమరావతికి పాదయాత్ర లాంటి రాజీలేని పోరాటాలకు సిద్ధమైన కారణంగానే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు దిగివచ్చి,ఆర్డీటీకి ఎఫ్ సి ఆర్ ఏ పునరుద్ధరణ చేయడం జరిగింది.
ఇది *యావత్తు ప్రజా విజయం*,భవిష్యత్తులో ఇదే స్ఫూర్తితో ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడినప్పుడు,ప్రజల హక్కులకు భంగం కలిగించి నప్పుడు,ఆయా ప్రాంతాల అభివృద్ధి కోసం అందరూ ఐక్యంగా పోరాటం సాగిస్తే విజయం తథ్యమని ఈ పోరాటం రుజువు చేసింది. అందుకే *జాతీయ కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా కమిటీ,ఈ పోరాటంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి,ప్రత్యేకంగా ఈ ఉద్యమానికి సహకరించిన మీడియా కు పేరుపేరునా కృతజ్ఞతలు,ధన్యవాదాలు తెలియజేస్తుంది.

వై మధుసూధన రెడ్డి,
జిల్లా అధ్యక్షులు,
జాతీయ కాంగ్రెస్ పార్టి అనంతపురం.

Posted Under AP
Editor