Latest Posts

రాయదుర్గం జూనియర్ కళాశాలలో ఎలుగుబంటి కలకలం: ఎట్టకేలకు బంధించిన అటవీ శాఖ అధికారులు

అనంతపురం జిల్లా
రాయదుర్గం

రాయదుర్గం జూనియర్ కళాశాలలో ఎలుగుబంటి బందీ.

ఎట్టకేలకు ఫలించిన అటవీ శాఖ అధికారుల ఆపరేషన్.

తెల్లవారుజాము నుంచి డిప్యూటీ రేంజర్ దామోదర రెడ్డి ఆధ్వర్యంలో గాలింపు.

కళాశాల బాత్రూమ్ లో నక్కిన ఎలుగుబంటిని గుర్తించిన నిపుణులు.

వలల సాయంతో చాకచక్యంగా ఎలుగుబంటిని బంధించిన అటవీ సిబ్బంది.

బోనులో బంధించి సుదూర అటవీ ప్రాంతానికి తరలించేందుకు ఏర్పాట్లు.

వణికిపోయిన స్థానికులు.. ఎలుగుబంటి చిక్కడంతో ఊపిరి పీల్చుకున్న ప్రజలు.

అప్పుడప్పుడే తెల్లవారుతోంది.. నిత్యం లాగే రాయదుర్గం పట్టణ వాసులు ప్రశాంతంగా గాలి పీలుస్తూ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో వాకింగ్ చేస్తున్నారు. మోడల్ స్కూల్ వాచ్మెన్ ఎలుగుబంటిని చూసి కేకలు వేశాడు మొదట కుక్క అనుకుని పొరబడిన వాకర్స్.. అది ఒక్కసారిగా ‘గుర్రు’ మంటూ గాండ్రించడంతో షాక్ తిన్నారు. అది సాక్షాత్తూ ఎలుగుబంటి అని గ్రహించిన వాకింగ్ బ్యాచ్ భయంతో పరుగులు తీశారు. మైదానం నుంచి తప్పించుకున్న భల్లూకం నేరుగా కళాశాల భవన సముదాయంలోకి దూసుకెళ్లింది.

అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని జూనియర్ కళాశాలలో చొరబడిన ఎలుగుబంటిని పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు చేపట్టిన చర్యలు ఫలించాయి. తెల్లవారుజాము నుంచి డిప్యూటీ రేంజర్ దామోదర రెడ్డి ఆధ్వర్యంలో నిపుణులు గాలింపు చేపట్టారు. చివరికి బాత్రూమ్లో ఉన్న ఎలుగుబంటిని వలల సాయంతో బంధించారు. బోను తెప్పించి సుదూర ప్రాంత అటవీ ప్రాంతానికి తరలించారు. దీంతో స్థానికులు, విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు.

Posted Under AP
Editor