ఖాద్రీ నరసింహుని సన్నిధిలో స్వప్న తిరుమంజనం లో పాల్గొన్న పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి గారు,
కదిరి లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు రాష్ట్ర ప్రజల పైన, మన గౌరవనీయులైన ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబు నాయుడు గారి పైన ఉండాలని పుట్టపర్తి శాసనసభ్యురాలు పల్లె సింధూర రెడ్డి గారు ఆకాంక్షించారు.
శ్రీ ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో రాష్ట్రంలో కుటుంబ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు మరో 20 ఏళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగాలని ఆమె కోరుకొన్నారు. అంతకుముందు శ్రీమద్ ఖాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి పవిత్ర బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వప్న తిరుమంజనం ( 16 రోజుల పండుగ) ఉత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి గారు ఏర్పాటుచేసిన స్వప్న తిరుమంజనం ఉత్సవముకు విష్ణువర్ధన్ రెడ్డి ఆహ్వానం మేరకు పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే తో పాటు కూటం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. భక్తులు అనేకమంది ఈ స్వప్న తిరుమంజనం పూజా కార్యక్రమంలో పాల్గొని ఆలయ అర్చకులచే మంత్రోచ్ఛారణల మధ్య పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. శ్రీమద్ ఖాద్రి లక్ష్మీ నరసింహ స్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా భక్తులకు దర్శనమిచ్చారు.
పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి గారికి, భక్తులకు, కార్యకర్తలకి YES9 టీవీ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో స్వప్న తిరుమంజనం: పాల్గొన్న ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి
