కదిరి, సత్యసాయి జిల్లా,
” ఉగాది ఉత్సవం”& పథ సంచలన్ ” రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(RSS),’
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, స్థాపించబడి నూరు సంవత్సరాలు పూర్తయినది. పూజనీయ డాక్టర్ “కేశవ్ బలిరాం హెడ్గేవార్ ” గారు విజయదశమి(27 సెప్టెంబర్, 1925 ) రోజున మహారాష్ట్రలోని నాగపూర్ లో “రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్” స్థాపించారు. సంపూర్ణ హిందూ సమాజాన్ని సంఘటితం( ఐక్యం) చేసి, హిందుత్వపు పునాదిపై మన భారతదేశాన్ని సమర్థవంతమైనదిగా, పరమ వైభవశాలిగాను, తీర్చిదిద్దడమే సంఘస్థాపన యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ మహాత్వ పూర్ణ కార్యం కొరకు గులవంతులు మరియు సమర్పణ భావం గల కార్యకర్తలు అవసరం. అలాంటి కార్యకర్తలు తయారు చేయడానికి డాక్టర్ హెడ్గేవార్ సంఘంలో ఒక సరళమైన, అత్యంత ప్రభావంతమైన ” దైనందిన శాఖ ” అనే పద్ధతిని అభివృద్ధి చేశారు. ఈ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి, సంఘ స్వయం సేవకులు గత 100 సంవత్సరాలుగా సమాజ జీవనంలోని వివిధ రంగాలలో క్రియాశీలంగా ప్రయత్నిస్తున్నారు.
ఈనాడు 51,740 స్థలాలలో 83,129 దైనిక శాఖలు మరియు 21,936 ఇతర స్థలాలలో 22, 866 సాప్ తాహిక్ మిలన్ ల ద్వారా సంఘ కార్యం దేశవ్యాప్తంగా విస్తరించింది. ఇది నిరంతరం పెరుగుతోంది. స్వయం సేవకులు తమ సామర్థ్యం మేరకు సామాజిక సమస్యలు మరియు సవాలను పరిష్కరించడంలో నిమగ్నమై ఉన్నారు. ఈనాడు సండే స్వయం సేవకులు సమాజ సహకారంతో ఆరోగ్యం, విద్య, సంస్కారం, స్వావలంబన వంటి అంశాలపై గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో 1,29,000 పైగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ “రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్” హిందువులను ఒకే తాటిపై ఉండాలని, హైందవ తత్వాన్ని ప్రపంచమంతా చాటి చెప్పాలని, హిందువులంతా సమానంగా కలిసిమెలిసి మెలగాలని ఈ సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం.
పై విధంగా హైందవ తత్వాన్ని చాటి చెప్పాలని మన కదిరి నియోజకవర్గంలో RSS సంఘం వారు “రూట్ మార్చ్” మార్చ్ ఫాస్ట్” చేసుకుంటూ బాలికల కళాశాలలో ప్రోగ్రాము కండక్ట్ చేశారు. ఈ ప్రోగ్రాం లో ఆర్ఎస్ఎస్ సంఘ నాయకులు మన హైందవ ధర్మాన్ని, హైందవ ధర్మ గొప్పతనాన్ని గొప్పగా చాటిచెప్పారు.
ఈ ఆర్ఎస్ఎస్ సంఘాన్ని స్థాపించిన డాక్టర్ హెడ్గేవార్ గారికి, ఈ ప్రోగ్రాం లో పాల్గొన్న ఆర్ఎస్ఎస్ సంఘం వారికి, ప్రపంచంలో ఉన్న హైందవులందరికీ YES9 టీవీ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
శతాబ్ది దిశగా సంఘ ప్రస్థానం: కదిరిలో RSS ‘పథ సంచలన్’.. హైందవ శక్తి చాటిన స్వయంసేవకులు!
