Latest Posts

అనంతపురం నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ బాధ్యతలు స్వీకరణ

అనంతపురం జిల్లా నగరపాలక

 

అనంతపురం, మార్చి 18 :

– అనంతపురం నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ బాధ్యతలు స్వీకరించారు. బుధవారం అనంతపురం కలెక్టరేట్ లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ బాధ్యతలు చేపట్టారు.

– రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన G.O. నెం. 284, తేదీ 10-03-2026 ప్రకారం జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ని అనంతపురం నగరపాలక సంస్థకు ప్రత్యేక అధికారిగా నియమించడం జరిగింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నగర పరిపాలనను మరింత సమర్థవంతంగా నిర్వహించడం, పౌరులకు నాణ్యమైన సేవలను అందించడం, కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడం దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఎస్ఈ రాజశేఖర్ పాల్గొన్నారు.

Posted Under AP
Editor