సత్యసాయి జిల్లా నల్లమాడ మండల కేంద్రంలో రైతులకు అవగాహన కార్యక్రమంలో భాగంగా ఇంటింటా తిరిగి పాంప్లెట్స్ పంచుతూ ప్రభుత్వం రైతులకు అందచేస్తున్న సంక్షేమ పథకాలు గురించి వ్యవసాయ విస్తరణ అధికారి కె.వెంకటరంగచారి ఆధ్వర్యంలో రైతులకు వివరించడం జరిగినది.
ఈ కార్యక్రమంలో రైతులు రసాయన మందులు వాడకుండా పకృతి పరంగా దొరికే ఎరువులు వాడి పంటలు పండించే విధానం,వ్యవసాయం,పశుశాంవార్తకం,ఉద్యాన వన రంగాలపై రైతులు దృష్టి పెట్టాలని లాభదాయకమైన వ్యవసాయ పద్ధతులు పాటించాలన్నారు.ప్రస్తుతం వేసవి కాలం ఉన్నందున అరుతడి పంటలు సాగు చేయాలన్నారు.నీటి విలువ తెలుసుకొని నీటిని వృధా చేయరాదాన్నారు.నీరు నిలువ ఉంచుకొనే మార్గాలు అన్వేషంచాలన్నారు.రైతులు ప్రజల డిమాండ్ చేసే పంటలు పండించాలన్నారు.జొన్న, సజ్జ ,కూరగాయలు,వాణిజ్య పంటలు సాగు చేయాలన్నారు.భూగర్భ జలాలు పొదుపుగా వాడుకోవాలన్నారు. మంచి ప్రాంతంలో సరైన పంట,ఉత్పత్తి,మార్కెట్ సాకర్యం ఉన్న పంటలు సాగు అవసరం ముఖ్య ఉద్దేశమని అన్నారు.రైతులు సాంకేతికతను పెంచుకోవాలని,డ్రోన్లుఉపయోగించి పురుగుమందులు చల్లడం, డ్రోన్ యాప్ ద్వారా పంటలవివరాలు, మార్కెట్ ధరలు,వ్యవసాయయంత్ర సేవ పనిముట్లు పొందటం,చీడ పురుగుల నివారణకు సలహాలు,ఎరుపుల స్టాక్ లభ్యత వంటి సాంకేతిక సమాచారం అగ్రిటెక్ ద్వారా పొందాలన్నారు.ఫుడ్ ప్రసాసింగ్ ద్వారా రైతు పండించిన పంటలు ఉత్పత్తులు నిల్వ చేసే సౌకర్యార్థం గిడ్డంగులు నిర్మించుకోవటం ద్వారా పంటలు గిట్టుబాటు ధర వచ్చినప్పుడు అమ్ముకునే విధంగా ఉండాలన్నారు, వీటికి ప్రభుత్వం రాయతీలు కలిపిస్తుందన్నారు.నీరు, విత్తనం,ఎరువులు, యంత్రం పరికరాలు, వ్యవసాయ అనుబంధ శాఖలు ద్వారా వివరించడం.రైతు ఆధారిత నమోదు సంఖ్య, రైతులు రేజిస్ట్రేషన్ చాలా ముఖ్యమన్నారు.సంక్షేమం నుండి సంపద సృష్టించే దిశగా రైతు లు అభివృద్ధి చెందాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో ఎంపీఈవో రాధ,హాస్పిటల్ డైరెక్టర్ బుట్టి నాగభూషణం నాయుడు, రైతన్న మీకోసం రైతులు, మాధవరెడ్డి, వలం క్రిష్టయ్య, జబ్బీర్ భాష ,బాలిరెడ్డి, ఎం నరసింహులు, రవీ నాయక్. రైతులు పాల్గొన్నారు.
