Latest Posts

శ్రీ పొట్టిశ్రీరాములు గారి విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు

కదిరి పట్టణం టవర్ క్లాక్ దగ్గర ఉన్న పొట్టిశ్రీరాములు గారి విగ్రహానికి కదిరి ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ గారు పూల మాల వేసి అమర జీవి పొట్టి శ్రీరాములు యొక్క మనో ఆత్మ ధైర్యాన్ని చాటి చెప్పాడు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష 1952 అక్టోబర్ 19 ప్రారంభించి 1952 డిసెంబర్ 15న అనగా 58 రోజులు చేసి ఆ దీక్షలోనే పొట్టి శ్రీరాములు గారు అమరుడయ్యాడు.భారతదేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఆవిర్భావానికి శ్రీ పొట్టి శ్రీరాములు గారి బలిదానమే బాటలు వేసింది. అటువంటి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఆయన త్యాగానికి గురుతుగా… శ్రీరాములుగారి జయంతి సందర్భంగా ‘ స్టాట్యూ ఆఫ్ సాక్రిఫైస్’ పేరిట కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 58 అడుగుల భారీ విగ్రహం ఏర్పాటు చేయడం వారి పోరాట పటిమకు నిదర్శనం అని తెలియజేసిన కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు ఈ కార్యక్రమంలో ఆర్డీవో వి వి ఎస్ శర్మ గారు,ఆర్య వైశ్యం సంఘం మరియు అనుబంధ సంఘాల సమాఖ్య కదిరి వారు,టీడీపి,కూటమి నాయకులు పాల్గొన్నారు.
మన కదిరి ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ గారు పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి పూలమాల వేసే కార్యక్రమానికి విచ్చేసిన ఆర్ డి ఓ గారికి ఆర్యవైశ్య సంఘం వారికి టిడిపి, కూటమి నాయకులకు YES9 టీవీ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.

Posted Under AP
Editor