ముస్లిం సోదరులకు పివిఆర్ ఫంక్షన్ హాల్,కదిరి,ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు*
ముస్లిం సోదరులకు పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా కదిరి పట్టణంలోని ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇవ్వడం ఆనందంగా అనిపించింది.
ముస్లిం మత పెద్దలు మరియు సోదరులు ఎంతో ఆత్మీయంగా స్వాగతం పలికారు. వారితో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొని, కొంత సమయం గడపడం ఎంతో సంతోషాన్ని కలిగించింది.
మత సామరస్యాన్ని పెంపొందిస్తూ అందరం కలిసికట్టుగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను తెలియజేసిన కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు ఈ కార్యక్రమంలో పీఠాధిపతి హజ్రత్ సయ్యద్ షాహమీర్ పీర్ ఖాద్రీ షాహమీరి గారు,డీఎస్పీ శివనారాయణ స్వామి,టీడీపి నాయకులు పవన్ కుమార్ రెడ్డి ,పట్టణ అధ్యక్షులు డైమండ్ ఇర్ఫాన్, కౌన్సిలర్ ఆల్ఫా yummyముస్తఫా,మహబూబ్ భాష, జిలాన్,టీడీపి నాయకులు బహుద్దీన్ గారు తదితరులు పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు,మత పెద్దలు పాల్గొనడం జరిగింది. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా కదిరి పట్టణంలో మన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ గారు ఇచ్చిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న ముస్లిం సోదరులకు, ఎమ్మెల్యే గారికి, డి.ఎస్.పి శివ నారాయణ స్వామి గారికి, టిడిపి నాయకులకు YES9 టీవీ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
కదిరిలో ఘనంగా ఇఫ్తార్ విందు: ముస్లిం సోదరులతో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్
