*ప్రహ్లాద సమేత స్వయంభూగా వేలశి యున్న క్షేత్రము శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానము*
కదిరి పట్టణము – 515591, శ్రీ సత్యసాయి జిల్లా., ఆంధ్రప్రదేశ్
ఫోన్ నెం : 08494 – 221066, 221366
*శ్రీస్వామి వారి నిత్య అన్నదాన పథకమునకు రూ.5,00,116/- రూపాయలు విరాళము*
శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానము అధ్వరములో నిర్వహించే శ్రీస్వామి వారి నిత్య అన్నదాన పథకానికి కర్నాటక రాష్ట్రం, కోలార్ జిల్లా, చిక్కనాయకనహళ్ళి వాస్తవ్యులు అయిన శ్రీ.బి.ఎ.రమేష్, శ్రీమతి.ధనలక్ష్మీ కుటుంబ సభ్యులు వారు స్వామి వారి దర్శనార్థము విచ్చేసి శ్రీవారి నిత్య అన్నదాన పథకమునకు రూ.5,00,116/-లను విరాళముగా సమర్పించియున్నారు. దాతను ఆలయ కార్యనిర్వహణాధికారి వెండిదండి శ్రీనివాసరెడ్డి అభినందిస్తూ దాతలకు శ్రీస్వామి అమ్మవార్ల ఆలయములలో ప్రత్యేక పూజలు చేయించి శ్రీస్వామి వారి చిత్ర పటము, శేషవస్త్రము, ప్రసాదము ఇవ్వడమైనది. శ్రీమద్ ఖాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారికి శ్రీ. బి.ఏ. రమేష్, శ్రీమతి ధనలక్ష్మి గారు శ్రీవారి నిత్య అన్నదానం కు రూ, 5,00,116/- లను సమర్పించి ఉన్నారు. వీరికి వీరి కుటుంబ సభ్యులకు YES9 టీవీ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
