తాడిమర్రి (Yes9tv)తాడిమర్రిలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా
జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని తాడిమర్రి మండల కేంద్రంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ చిలకం మధుసూదన రెడ్డి గారి ఆదేశాల మేరకు జిల్లా సంయుక్త కార్యదర్శి దూది జయరామాంజినేయులు గారి ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు. పార్టీ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో తాడిమర్రి మండల అధ్యక్షులు మోహన్ గౌడ్, పార్టీ నాయకులు ఆకుల రంగనాయకులు, రంగారెడ్డి, రామచంద్ర రెడ్డి, రాజు, శ్రీనివాసులు, రామచంద్ర తదితరులు పాల్గొన్నారు.
తాడిమర్రిలో జనసేన ఆవిర్భావ వేడుకలు: కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసిన నాయకులు
