ధర్మవరంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్ష: ఎస్సీ జన సంఘం నాయకుల సంఘీభావం

తాడిమర్రి(yes9tv)ధర్మవరంలో నిరంతర రిలే నిరాహార దీక్షకు ఎస్సీ జన సంఘం నాయకుల మద్దతు
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని ఎమ్మార్వో కార్యాలయం ఎదుట కొనసాగుతున్న నిరంతర రిలే నిరాహార దీక్షకు హిందూ సంఘాల నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో మద్దతు తెలుపుతున్నారు.
ఈ సందర్భంగా తాడిమర్రి మండలం చిల్ల కొండయ్య పల్లి గ్రామానికి చెందిన ఎస్సీ జన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు కర్ణాటక రాష్ట్ర ఇంచార్జ్ సాకే కుళ్లాయప్ప, ఎస్సీ జన సంఘం రాష్ట్ర ఇంచార్జ్ మాల్యవంతం రాంప్రసాద్, ధర్మవరం తాలూకా అధ్యక్షుడు సంగాల శ్రీను పాల్గొని, జయకృష్ణ ట్రస్ట్‌కు చెందిన డాక్టర్ వివేక్ కుళ్లాయప్ప యాదవ్ ను కలిసి రిలే నిరాహార దీక్షకు మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందూ దేవాలయాలను ప్రభుత్వ ఆధీనంలో నుంచి తొలగించి, స్వతంత్ర హిందూ సనాతన బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే కాశీ విశ్వనాథ స్వామి ఆలయం మాన్యాల్లో ఉన్న అక్రమాలను తొలగించాలని, విద్యాసంస్థల్లో హిందూ ధర్మ బోధనకు అనుమతి ఇవ్వాలని కోరారు.
అదేవిధంగా ధర్మవరంలో హిందువుల కోసం నూతన స్మశానవాటిక ఏర్పాటు చేయాలని, దేవాలయ మాన్యాలపై ఉన్న అక్రమాలను తొలగించాలని, హిందూ మైనారిటీ విద్యాసంస్థల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని వారు పేర్కొన్నారు.
దేవాలయాల్లో పనిచేస్తున్న పూజారులకు నెలకు రూ.15,000 వేతనం ఇవ్వాలని, గ్రామీణ ప్రాంత ప్రజల ఆరోగ్య రక్షణ కోసం గ్రామీణ ఆసుపత్రుల్లో 24 గంటలు ఎంబీబీఎస్ వైద్యులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రతి పీహెచ్‌సీలో ముగ్గురు ఎంబీబీఎస్ డాక్టర్లను నియమించాలని కోరారు.
ఈ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చేంతవరకు రిలే నిరాహార దీక్షలను నిరంతరం కొనసాగిస్తామని డాక్టర్ వివేక్ కుళ్లాయప్ప యాదవ్ తెలిపారు.

Posted Under AP
Editor