Latest Posts

భూమికి సర్వహక్కుదారు మీరే. పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు.

  • అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం

ప్రతి రైతుకు తన సొంత పొలంపై సర్వ హక్కులు కల్పిస్తూ ప్రభుత్వం పట్టాదారు పాస్ పుస్తకాలను జారీ చేస్తోందని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు వెల్లడించారు. అందులో భూ యజమాని ఫోటో, ప్రభుత్వ రాజముద్ర మినహా ఇంకెవరి ఫోటోలు ముద్రించనందున తమ భూములు ఇంకెవరో స్వాధీనం చేసుకుంటారన్న అభద్రతా భావం అవసరంలేదని స్పష్టం చేశారు. రాయదుర్గం రూరల్ బాగినాయకనహళ్లి లో సోమవారం నిర్వహించిన “మీ భూమి మీ హక్కు” కార్యక్రమంలో రైతులకు ఆయన పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజముద్రతో కూడుకున్న వివాద రహితమైన పాస్ పుస్తకాలను ప్రతి రైతుకు అందించడం జరుగుతోందన్నారు. అందులో ఉన్న హలో గ్రామ్ సాయంతో
మీ సెల్ ఫోన్ లో ఎప్పుడైనా మీ భూమి వివరాలు సులువుగా తెలుసుకోవడం వీలవుతుందన్నారు. మీకు మీరుగా మీ భూమి అమ్మితే మినహా… అందులో ఇతరులు ఎలాంటి చేర్పులు, మార్పులు చేయటానికి కుదరదన్నారు. ఏళ్ల తరబడి మన అనుభవంలో ఉంటూ మన పెద్దలు సాగుచేసిన భూముల కూడా కొన్ని ప్రాంతాల్లో సంబంధం లేని వ్యక్తుల పేర్లతో ఉంటున్నాయన్నారు. అలాంటప్పుడు ఆ భూమి మాదేనని రికార్డుల ప్రకారం నిరూపించుకునే అవకాశం లభించదన్నారు. ఇలాంటి సమస్యలన్నింటికీ ఏకైక పరిష్కార మార్గం నేడు కూటమి ప్రభుత్వం మీకు అందిస్తున్న రాజముద్రతో కూడిన పట్టాదార్ పుస్తకాలేనని తెలియజేశారు. ఆ భూమిపై మీకు సర్వహక్కులు, అధికారాలు ఉన్నాయని తెలియజేయడానికి ఈ పుస్తకం ఓ బలమైన ఆయుధం లాంటిది. ప్రభుత్వం ఇచ్చే పంట నష్ట పరిహారం లభించాలన్న, సబ్సిడీ విత్తనాలు కావాలన్నా, లేదా బ్యాంకుల నుండి రుణాలు పొందాలన్న ఈ పాసు పుస్తకం ఏకైక ఆధారమన్నారు. జాయింట్ ఎల్బీ నెంబర్లు ఉన్న రైతులు వాటిని సరిచేయించుకుని మీ భూమి సర్వే నెంబర్, విస్తీర్ణం, సరిహద్దు తదితర వివరాలు పూర్తిస్థాయిలో పట్టాదారు పాసు పుస్తకంలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆయా సీజన్లలో రైతులు సాగు చేసే పంట, విస్తీర్ణం తప్పక సంబంధిత రైతు సేవ కేంద్రాల్లో తప్పక నమోదు చేయించుకోవాలని సూచించారు. తద్వారా ఏదైనా విపత్కర పరిస్థితుల్లో పంట నష్టం వాటిలితే రైతులకు ప్రభుత్వం ద్వారా లేదా బీమా కంపెనీల ద్వారా ఆర్థిక సహాయం పొందే హక్కు లభిస్తుందన్నారు. పట్టాదారు పాస్ పుస్తకం రైతు పేరు మీదనే ఉన్నప్పటికీ పంట నమోదు వివరాలు రైతు సేవా కేంద్రాల ద్వారా తెలియజేయకపోతే నష్టం వాటిల్లినా ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందదని ఎమ్మెల్యే కాలవ గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కురుబ హనుమంతు, కాటా వెంకటేశులు, సర్పంచ్ రాజశేజర్ రెడ్డి, తిమ్మారెడ్డి, సోము, వన్నూరుస్వామి తదితరులు పాల్గొన్నారు.

Posted Under AP
Editor