Latest Posts

రాయదుర్గంలో ఆపరేషన్ ‘వజ్రప్రహార్’: మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని డీఎస్పీ రవిబాబు పిలుపు

అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం

* దుర్గంలో ఆపరేషన్ “వజ్రప్రహార్”

• డిఎస్పి రవిబాబు ఆధ్వర్యంలో ఆపరేషన్ వజ్రప్రహర్ కాటన్ సెర్చ్

అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని కోతి గుట్ట ప్రాంతంలో కళ్యాణదుర్గం డిఎస్పి రవిబాబు ఆధ్వర్యంలో పోలీసులు శనివారం ఉదయం ఆపరేషన్ వజ్రప్రహర్ కాటన్ సెర్చ్ నిర్వహించారు.
విద్యార్థులు, యువత, ప్రజలు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, మత్తు పదార్థాల చేతిలో కీలుబొమ్మలుగా మారవద్దని అవగాహన కల్పించారు.
“మత్తు వద్దు- జీవితమే ముద్దు’ అంటూ నినాదాలు చేయించారు. అనంతరం రాయదుర్గం ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో విద్యార్థినులకు ఆపరేషన్ వజ్రప్రహార్ పై వివరించారు.
ఈ సందర్భంగా కళ్యాణదుర్గం డిఎస్పి రవిబాబు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న డ్రగ్ ఫ్రీ ఆపరేషన్ వజ్రప్రహార్ లో భాగంగా అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు రాయదుర్గం పట్టణంలో వజ్ర ప్రహార్ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని వివరించామన్నారు. మారక ద్రవ్యాల విక్రయాలు, వినిమయం వంటి ఆసాంఘిక కార్యకలాపాల నివారణకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశామన్నారు. మత్తు పదార్థాల వినియోగంపై పోలీసులకు ప్రజలు సమాచారం ఇవ్వాలని సూచించినట్లు డీఎస్పీ పేర్కొన్నారు.
ఆపరేషన్ వజ్ర ప్రహర్ కార్యక్రమంలో రాయదుర్గం అర్బన్, రూరల్ సిఐలు జయ నాయక్, వెంకటరమణ, పోలీసులు, విద్యార్థినులు, ప్రజలు పాల్గొన్నారు.

బైట్స్ : 1. రవిబాబు, డీఎస్పీ కళ్యాణదుర్గం

Posted Under AP
Editor