అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం

మున్సిపల్ ఔట్సోర్సింగ్ కార్మికులకు వయోపరిమితి 62 సంవత్సరాలు పెంచాలి : సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి బి మల్లికార్జున డిమాండ్

రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ పారిశుధ్య ఇంజనీరింగ్ కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వయోపరిమితిని 62 సంవత్సరాలకు పెంచాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి బి మల్లికార్జున రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం కార్మికులతో కలిసి మార్చి 6 7 తేదీలలో రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం రెండు రోజులపాటు రిలే నిరాహార దీక్షలను చేపడుతున్నట్లు తెలియజేస్తూ రాయదుర్గం మున్సిపల్ అధికారులకు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మల్లికార్జున మాట్లాడుతూ, 60 సంవత్సరాలు నిండి విధుల నుండి తొలగిస్తున్న కార్మికుల కుటుంబాల్లో ఒకరికి ఆ ఉద్యోగాన్ని ఇచ్చి ఆ కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. పట్టణ జనాభా కనుగుణంగా ప్రస్తుతం ఉన్న కార్మికులతో పాటు అదనంగా మరో 70 మంది కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికులకు ఆప్కాస్ నుండి కాకుండా నేరుగా రాష్ట్ర ప్రభుత్వమే వారికి వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇంజనీరింగ్ కార్మికులకు టెక్నికల్ వేతనాలు చెల్లించాలని, సంక్షేమ పథకాలను వీరికి అమలు చేయాలని,GO RT NO 15,16ప్రకారం PRC వేతనాలు ఇవ్వాలని, కరువు భత్యం, మధ్యంతర భృతి ఇవ్వాలని తదితర డిమాండ్ల సాధన కై జరుగుతున్న ఈ ధీక్ష లను కార్మికులందరూ పాల్గోని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు సీనియర్ నాయకులు నాగరాజు మరియు మున్సిపల్ వర్కర్స్ అన్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ నాయకులు రాము మల్లేష్ తిప్పేస్వామి విజయ్ తదితరులు పాల్గొన్నారు.

Posted Under AP
YES9 TV