హైదరాబాద్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటిస్తున్న సందర్భంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.. ఎక్స్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని నిలదీశారు. తెలంగాణ నిరుద్యోగుల బాధలు పట్టించుకోరా అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు.వికారాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న డీసీసీ అధ్యక్షుల శిక్షణ కార్యక్రమంలో ప్రసంగించేందుకు కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ .. ఇవాళ తెలంగాణకు వచ్చారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రాహుల్ గాంధీకి కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం వికారాబాద్ జిల్లా అనంతగిరి హిల్స్‌లో నిర్వహించిన కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశంలో హాజరయ్యారు. అయితే రాహుల్ గాంధీ రాష్ట్రానికి వచ్చిన వేళ.. తెలంగాణ జాగృతి చీఫ్ కవిత.. సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు సంధించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలుపై రాహుల్ గాంధీని కవిత నిలదీశారు.
