ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీలను పెండింగ్ ఉంచకుండా పరిష్కరించాలి – : జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్…

అనంతపురం, మార్చి 02 :

– *అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం, పిజిఆర్ఎస్), రెవెన్యూ క్లినిక్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లాలోని ఆయా మండలాల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారుల నుండి జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహర్, డిఆర్ఓ ఏ.మలోల, జిల్లా ఫారెస్ట్ సెటిల్మెంట్ అధికారి జి.రామకృష్ణారెడ్డి, ఆర్డీఓ కేశవనాయుడు, ఎస్డీసిలు రామ్మోహన్, ఆనంద్, మల్లికార్జునుడు, ఆయా శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు. ఇందులోభాగంగా ప్రజల నుంచి 504 అర్జీలను జాయింట్ కలెక్టర్ స్వీకరించారు.*

– *ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమంలో వచ్చిన అర్జీలను ఎప్పటికప్పుడు పెండింగ్ లేకుండా పరిష్కరించాలని ఆదేశించారు. అర్జీదారులతో మాట్లాడి వారి సమస్యలకు నాణ్యమైన పరిష్కారం చూపించాలన్నారు. పిజిఆర్ఎస్ అర్జీలపై ఆయా శాఖల జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి సారించి వాటిని సకాలంలో పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. గడువులోపు అర్జీలను పరిష్కరించడం అత్యంత కీలకమైనదని, అర్జీల పరిష్కారంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండరాదన్నారు. జిల్లాలో వేసవిని దృష్టిలో ఉంచుకుని ఎక్కడా తాగునీటి సమస్య రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆర్డబ్ల్యుఎస్ అధికారులను ఆదేశించారు. ఎన్ఆర్ఈజిఎస్ కింద ఉపాధి పనులు చేసే సమయంలో షెల్టర్ ల ఏర్పాటు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు.*

– *ఈ కార్యక్రమంలో ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ శేషాద్రి శేఖర్, డిపిఓ నాగరాజునాయుడు, ఆర్డబ్ల్యుఎస్ ఎస్ఈ సురేష్, డ్వామా పిడి సలీమ్ భాష, పంచాయతీరాజ్ ఎస్ఈ సుబ్బరాయుడు, జిల్లా వ్యవసాయ అధికారి రవి, ఎపిఎంఐపి పిడి రఘునాథరెడ్డి, హార్టికల్చర్ డిడి ఉమాదేవి, డిఎండబ్ల్యుఓ రామసుబ్బారెడ్డి, డిసిఓ అరుణకుమారి, హౌసింగ్ పిడి శైలజ, ఐసీడీఎస్ పిడి శ్రీదేవి, డిటిసి వీర్రాజు, జడ్పి సిఈఓ శివశంకర్, సిపిఓ అశోక్ కుమార్, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి శ్రీనివాస యాదవ్, వయోజన విద్య ఉపసంచాలకులు వెంకటేశ్వర్లు, ఎండోమెంట్ ఏసి మల్లికార్జున ప్రసాద్, పశుసంవర్ధక శాఖ జెడి ప్రేమ్ చంద్, మైనర్ ఇరిగేషన్ ఎస్ఈ విశ్వనాథరెడ్డి, డిఆర్డీఏ పిడి శైలజ, కలెక్టరేట్ సెక్షన్ సూపరింటెండెంట్లు రియాజుద్దీన్, వసంతలత, యుగేశ్వరిదేవి, కలెక్టరేట్ ఏఓ అలెగ్జాండర్, ఆయా శాఖల జిల్లా అధికారులు, తహసీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.*

Posted Under AP
Editor