Latest Posts

కదిరి బ్రహ్మోత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు: భక్తులకు ఇబ్బంది కలగకుండా చూడాలని కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యే ఆదేశం

  • శ్రీమత్ ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో ఎటువంటి లోపాలు ఉండకూడదు….
  • బ్రహ్మోత్సవం వేడుకలకు పటిష్టమైన పోలీస్ భద్రత ఏర్పాట్లు..
  • క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు పరిశీలన..
  • అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన
  • జిల్లా కలెక్టర్ …జిల్లా ఎస్పీ… ఎమ్మెల్యే గారు…

 

కదిరి శ్రీమత్ ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవ వేడుకల సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎటువంటి లోపాలు లేకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఎం. శ్యాంప్రసాద్ ఐఏఎస్ గారు,
జిల్లా ఎస్పీ శ్రీ ఎస్ సతీష్ కుమార్ ఐపీఎస్ గారు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ గారు అధికారులకు ఆదేశించారు. శ్రీమత్ ఖాద్రి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల వేడుకలు ఈనెల 27 నుండి , మార్చి 13 వరకు 15 రోజులపాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్న సందర్భంగా బుధవారం జిల్లా కలెక్టర్ ఎం శ్యాంప్రసాద్ ఐఏఎస్ గారు, జిల్లా ఎస్పీ శ్రీ ఎస్ సతీష్ కుమార్ ఐపీఎస్ గారు, ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ గారితో కలిసి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు పై అన్ని శాఖల అధికారులతో సమీక్షించారు. మీ బ్రహ్మోత్సవాల సందర్భంగా చేపట్టవలసిన ఏర్పాట్లు జాగ్రత్తలపై సూచనలు చేశారు.

ఈ బ్రహ్మోత్సవాలకు ఆంధ్ర కర్ణాటక తమిళనాడు నుంచే కాక వివిధ రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున భక్తులు రానున్నడంతో , భక్తులను దృష్టిలో ఉంచుకొని భద్రతా ఏర్పాట్లు, రాకపోకల నియంత్రణ, క్యూలైన్ వ్యవస్థ, బ్యారికేడింగ్, అత్యవసర మార్గాలు, పార్కింగ్ స్థలాలు తదితర అంశాలను జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ ఎమ్మెల్యే గారితో కలిసి క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించారు.

*ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ*

ఈ బ్రహ్మోత్సవాలు 15 రోజులపాటు జరుగుతున్న నేపథ్యంలో అందరి సహకారంతో ఉత్సవాలను ఎటువంటి లోపాలు లేకుండా విజయవంతం చేయాలని సూచించారు ఈ బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర నలుమూలల నుంచి వస్తున్న భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాట్లు ముందస్తుగా చేసుకోవాలని అధికారులకు ఆదేశించారు అన్ని శాఖల సమన్వయంతో
ఈ బ్రహ్మోత్సవాల వేడుకలు విజయవంతం చేయాలని కలెక్టర్ గారు పిలుపునిచ్చారు.

*జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ*

ఈ బ్రహ్మోత్సవాలు ఎంతో పకడ్బందీగా నిర్వహించడం జరుగుతుందని ఈ వేడుకలకు పటిష్టమైన పోలీస్ భద్రతా ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలని పోలీస్ అధికారులకు ఆదేశించారు.
ఈ సందర్భంగా ఆలయ పరిసరాలు, గర్భగుడి క్యూలైన్లు, ఘాట్ ప్రాంతం, ప్రధాన రహదారులు, పార్కింగ్ ప్రాంతాలు, కంట్రోల్ రూమ్ ఏర్పాట్లు, సీసీ కెమెరాల పర్యవేక్షణ తదితర అంశాలను సమీక్షించారు. ఇతర శాఖలతో సమన్వయం చేస్తూ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
భక్తుల రద్దీ అధికంగా ఉండే ప్రాంతాల్లో
ప్రత్యేక బందోబస్తు, స్పెషల్ పార్టీ ఫోర్స్, రోప్ పార్టీ, లా అండ్ ఆర్డర్ సిబ్బందితో విస్తృత భద్రతా ఏర్పాట్లు చేయడంతో పాటు సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలను కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేసి నిరంతర నిఘా ఉంచుతున్నామని తెలిపారు. పబ్లిక్ అడ్రెసింగ్ సిస్టమ్ ద్వారా మార్గదర్శకాలు, వైద్య శిబిరాలు, త్రాగునీటి సదుపాయాలు, సముచిత లైటింగ్ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వృద్ధులు, మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఇరువైపులా బ్యారికేడ్లు ఏర్పాటు చేసి, భక్తుల నియంత్రణకు పటిష్ట బందోబస్తు కల్పిస్తున్నామని తెలిపారు.
భక్తులు పోలీసు సూచనలను పాటిస్తూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.శాంతిభద్రతల పరిరక్షణతో పాటు భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించడమే ప్రధాన లక్ష్యమని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు.

*ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ గారు మాట్లాడుతూ*
కదిరి శ్రీమత్ ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల తో పాటు రథోత్సవ కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని కదిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు రాష్ట్రంలోనే ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉందని ఈ వేడుకలకు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు సిద్ధం చేసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. అందరి సహకారంతో ఈ బ్రహ్మోత్సవాలు విజయవంతం అయ్యేవిధంగా చూడాలని ఎమ్మెల్యే గారు ఈ సందర్భంగా తెలియజేశారు.

ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ , ఎమ్మెల్యే గారితో పాటు, జాయింట్ కలెక్టర్ భరద్వాజ్, డి.ఎస్.పి శివన్నారాయణ స్వామి, మున్సిపల్ కమిషనర్ కిరణ్ కుమార్, ఆలయ ఈవో, సిఐలు నారాయణరెడ్డి, నిరంజన్ రెడ్డి, నాగేంద్ర ,అన్ని శాఖల అధికారులు, ఆలయ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

పుట్టపర్తి జిల్లా పోలీస్ కార్యాలయం..

Posted Under AP
Editor