Latest Posts

నీరాలవంక తండాలో ప్రభుత్వ ఉద్యోగి ఘాతుకం: వ్యక్తిపై కొడవలితో దాడి, గ్రామస్థుల ఆందోళన

శ్రీ సత్య సాయి జిల్లా నల్లమాడ మండలం, నీరాలవంక తండా గ్రామం నందు చల్లప్ప నాయక్ అనే వ్యక్తి పై విజయ్ నాయక్ అనే ఒక ప్రభుత్వ ఉద్యోగి విచక్షణా రహితంగా కొడవలితో దాడి చేసి అతని తలపై తీవ్రమైన గాయం కలిగించి అతని కుటుంబం పై కూడా దాడి చేసినాడు. ఈ వ్యక్తి గతంలో కూడా వారి గ్రామస్తులపై ఇలాగే దాడి చేసినాడు అని గ్రామస్తులు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇతనిపై చర్య తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. నల్లమాడ si సతీష్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు

Posted Under AP
Editor