అనంతపురం జిల్లా
రాయదుర్గం నియోజకవర్గం•••••
- యువకుడు ఆత్మహత్య
- మొబైల్ రీఛార్జ్ డబ్బులు ఇవ్వలేదని పురుగుల మందు తాగి అఘాయిత్యం
అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని డి.హీరేహాళ్ మండలం కల్యం గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బోయ రామకృష్ణ, లక్ష్మీ దంపతుల కుమారుడు నవీన్ (17) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం నవీన్ 5వ తరగతి వరకు చదివి చదువు మానివేశాడు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి వ్యవసాయ పనులకు వెళ్లుతూ కుటుంబానికి తోడ్పడుతున్నాడు. రెండు రోజుల క్రితం మొబైల్ ఫోన్ రీఛార్జ్ కోసం తల్లిదండ్రులను డబ్బులు అడిగాడు. ప్రస్తుతం తమ వద్ద డబ్బులు లేవని వారు చెప్పడంతో మనస్థాపానికి గురైనట్లు సమాచారం.
ఆవేదనతో ఇంటి సమీపంలోని వ్యవసాయ తోటకు వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతడిని రాయదుర్గం ప్రభుత్వ కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం బళ్లారి లోని విమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం నవీన్ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు డి.హీరేహాళ్ ఎస్సై గురు ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. గ్రామంలో ఈ ఘటన కలకలం రేపగా, కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
బైట్:-గురు ప్రసాద్ రెడ్డి , డి.హీరేహాళ్ ఎస్సై.
