పరిటాల శ్రీరామ్ చొరవతో ప్రశాంతంగా కాటకోటేశ్వరస్వామి బ్రహోత్సవాలు

  • పరిటాల శ్రీరామ్ చొరవతో ప్రశాంతంగా కాటకోటేశ్వరస్వామి బ్రహోత్సవాలు
  • 10రోజులుగా శ్రమించి అందర్నీ ఏకతాటిపైకి తెచ్చిన శ్రీరామ్
  • చాలా ఏళ్ల తర్వాత సాంప్రదాయ పద్ధతిలో ఐక్యంగా ఉత్సవాలు
  • అగ్నిగుండ ప్రవేశ కార్యక్రమంలో స్వయంగా పాల్గొన్న శ్రీరామ్
  • అన్ని గ్రామాల పెద్దలకు, పోలీసులకు కృతజ్ఞతలు తెలిపిన శ్రీరామ్

గత కొన్నేళ్లుగా వివాదాలు, ఉద్రిక్తతలకు కేంద్రంగా మారిన చిల్లవారిపల్లి కాటకోటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు.. ఈసారి ధర్మవరం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి పరిటాల శ్రీరామ్ చొరవతో ప్రశాంత వాతావరణంలో జరిగాయి. తాడిమర్రి మండలం చిల్లవారిపల్లి సమీపంలో శ్రీ కాటకోటేశ్వరస్వామి క్షేత్రంలో మహాశివరాత్రి సందర్భంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. రెండు రోజుల పాటు కొన్ని గ్రామాల ప్రజలు, పలు సామాజిక వర్గాల వారు సాంప్రదాయ పద్ధతిలో ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. అయితే గత కొన్నేళ్లుగా ఉత్సవాల నిర్వహణలో విబేధాలు వచ్చాయి. దీంతో కొన్ని గ్రామల మధ్య, సామాజిక వర్గాల మధ్య వైషమ్యాలు ఏర్పడి. చాలా సార్లు ఘర్షణలు జరిగి.. ఉద్రిక్త పరిస్థితులు కనిపించేవి. ఈ పరిస్థితిని గమనించిన పరిటాల శ్రీరామ్ గత ఏడాదిలోనే అందర్నీ ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేశారు. ఈసారి వేడుకలకు 10రోజుల ముందు నుంచే శ్రీరామ్ స్వయంగా రంగంలోకి దిగి.. అభ్యంతరాలు చెబుతున్న వారితో మాట్లాడారు. గ్రామాల పెద్దల్ని, ఆలయ పూజార్లందర్నీ ఏకతాటిపైకి తీసుకొచ్చారు. దీనికి తోడు డీఎస్పీ హేమంత్ కుమార్ కూడా ప్రత్యేకంగా దృష్టి సారించి ఈ విషయంలో చొరవ చూపారు. దీంతో రెండు రోజుల పాటు నిర్వహించిన వేడుకలు ప్రశాంతంగా ముగిసాయి. ఆదివారం చిల్లవారిపల్లి నుంచి స్వామివారి ఆభరణాలను గుర్రాలపై, ఎలవగంపలో ఉంచి కాటకోటేశ్వర క్షేత్రానికి బయలు దేరి సోమవారం తెల్లవారు జామునకు కాటకోటేశ్వర క్షేత్రానికి చేరుకున్నాయి. అనంతరం మధ్యాహ్నం స్వామి వారి గుర్రములతో భక్తుల అగ్నిగుండ ప్రవేశం ఘనంగా జరిగింది. ఈవేడుకల్ని తిలకించడానికి శ్రీసత్యసాయి, అనంతపురం, కడప జిల్లాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ఉత్సవాల వివాదాల నేపథ్యంలో ఎస్పీ సతీశ్ కుమార్ ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉత్సవాలు ప్రశాంతంగా ముగియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈసందర్భంగా శ్రీరామ్ మాట్లాడుతూ గతంలో సాంప్రదాయబద్ధంగా అందరూ ఐక్యంగా ఉత్సవాలు నిర్వహించుకునే వారన్నారు. అయితే దురదృష్టవశాత్తు కొన్ని విబేధాలు రావడంతో అనుకోని సంఘటనలు జరిగాయన్నారు. ఈసారి ఇలాంటి వాటికి తావివ్వకూడదని పెద్దలందరితోను మాట్లాడామన్నారు. అందరూ ఐక్యంగా ఉత్సవాల నిర్వహణకు ముందుకు రావడం మంచి పరిణామమన్నారు. ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ శ్రీరామ్ కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా ఇందులో పోలీస్ శాఖ వారు సుమారు వారం రోజులుగా ఇక్కడే ఉండి.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా చేశారన్నారు. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, డీఎస్పీ హేమంత్ కుమార్ సిఐ సునీత కి ఎస్ఐ కృష్ణవేణికి కి గ్రామస్థులందరి తరుఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇక నుంచి చిల్లవారిపల్లి కాట కోటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ప్రశాంతంగా, ఒక ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగుతాయని శ్రీరామ్ ఆశాభావం వ్యక్తం చేశారు

Posted Under AP
Editor