రాయదుర్గంలో రూ.10 కోట్లతో అభివృద్ధి పనులు…

అనంతపురం జిల్లా
రాయదుర్గం నియోజకవర్గం•••••

రాయదుర్గంలో రూ.10 కోట్లతో అభివృద్ధి పనులు

రాయదుర్గం ప్రజల అవసరాల నిమిత్తం రూ.10 కోట్లతో వివిధ రకాల అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు తెలిపారు. రాయదుర్గం పట్టణంలో ఏర్పాటు చేస్తున్న సీసీ రోడ్లను సోమవారం ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పట్టణంలో చేపట్టిన పనులపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని పేర్కొన్నారు. “ఇదివరలో రోడ్లు లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. మీరు వచ్చిన తర్వాతే రోడ్లు బాగుపడుతున్నాయి” అని ప్రజలు చెప్పడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పల్లెలు, పట్టణాల్లో అభివృద్ధి జోరందుకుంటోందని, ఈ పనులతో మరోసారి అది నిరూపితమవుతోందన్నారు. మున్సిపాలిటీకి వచ్చే సాధారణ నిధులతో పాటు వివిధ మార్గాల్లో అదనపు నిధులు తీసుకువచ్చి పట్టణ ప్రజల అవసరాలకు వినియోగిస్తున్నామని తెలిపారు.
కనేకల్లు నుంచి రాయదుర్గం వరకు ఉన్న ప్రధాన తాగునీటి పైప్‌లైన్ మరమ్మత్తు పనులు, మోటార్ల కొనుగోలుకు రూ.40 లక్షలు మంజూరు చేశామని చెప్పారు. అలాగే రూ.30 లక్షల విలువైన పైప్‌లైన్ పనులు కూడా పట్టణంలో చేపట్టినట్లు వెల్లడించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాయదుర్గం పట్టణ ప్రజల అవసరాల కోసం రూ.10 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. అందులో ఇప్పటికే 80 శాతం పనులు పూర్తయ్యాయని, మరో రూ.3 కోట్ల విలువైన పనులు త్వరలో ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.
రాబోయే మూడు సంవత్సరాల్లో పట్టణ ప్రజలకు పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు కల్పించేందుకు మరిన్ని పనులు చేపడతామని ఎమ్మెల్యే తెలిపారు.
ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు బండి కృష్ణమూర్తి, మండల కన్వీనర్ మోహన్ రెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ హనుమంత రెడ్డి, మాజీ కార్పొరేషన్ డైరెక్టర్ టంకశాల హనుమంతు, డబ్బిడి శివ, పద్మశాలి డైరెక్టర్ పురుషోత్తం, బుదూరు తిప్పేస్వామి, గాజుల వెంకటేశులు, కడ్డిపూడి మహబూబ్ బాషా, ఎల్లప్ప, రావుత్ రాజశేఖర్, కెడిమి తిప్పేస్వామి, వేణు, యాలపుల వెంకటేశులు, జీలాన్, ఇనాయత్ తదితరులు పాల్గొన్నారు.

Posted Under AP
Editor