ఘనంగా శివపార్వతుల కళ్యాణం
శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలంలోని రాగానిపల్లిలోని ఉమామహేశ్వర ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శివపార్వతుల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం 5 గంటలకే లింగాభిషేకంతో ప్రారంభమైన ఈ కార్యక్రమం అనంతరం నిర్వహించిన శివపార్వతుల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. మండల పరిధిలోని అన్ని గ్రామాల నుంచి వచ్చిన అశేష భక్త జనావళి శివ కళ్యాణాన్ని వీక్షించి తరించారు. అనంతరం భక్తులకు ప్రసాదాలు అందించి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు శివపార్వతుల విగ్రహాలను గ్రామోత్సవంగా ఊరేగించారు. ఏడు గంటలకు శ్రీమతి మీనాక్షి గారిచే ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమం నిర్వహించారు. రాత్రంతా భక్తులు భజన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ జాగరణ చేశారు. కార్యక్రమంలో భక్తాదులు రాగానిపల్లి గ్రామ ప్రజలందరూ పాల్గొన్నారు.
