- శివనామ స్మరణతో మార్మోగిన శివాలయాలు…
ఆలయాలకు బారులు తీరిన భక్తులు..
సంగమేశ్వర మందిరంలో రుద్రాభిషేకాలు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు. శివపార్వతుల కళ్యాణం.. పల్లకి సేవ…
సంగారెడ్డి ప్రతినిధి :మహా:
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం నాడు పట్టణ మరియు మండల గ్రామాలలోని శివాలయాలలో ఉదయం 6 గంటల నుండి స్వామివారిని దర్శించేందుకు భక్తులు బారులు తీరారు. మండలంలోని నంది కంది గ్రామ శ్రీరామలింగేశ్వర ఆలయం దర్శించేందుకు మండలంలోని భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని శివలింగాన్ని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు బుచ్చప్ప. గ్రామ సర్పంచ్ ఆర్ స్రవంతి విజయ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్ల చేశారు. పట్టణంలోని శ్రీ సంగమేశ్వర మందిరం. శంబి లింగేశ్వర మందిరం. ఈశ్వర మార్కండేయ మందిరం. బసవేశ్వర మందిరం. రవీంద్ర మాడల్ దగ్గర శివాలయం తదితర శివ ఆలయాలలో భక్తులు పెద్ద ఎత్తున హాజరై ఓంనమశ్శివాయ నామస్మరణల మధ్య శివాలయాలు మార్మోగాయి. స్థానిక శ్రీ సంగమేశ్వర మందిరం ఆలయ భజన భక్త బృందం. పూజారులు జి మోహన్రావు. బి ఎన్ శంకర్రావు. నారాయణరావుల ఆధ్వర్యంలో ఉదయం 6 గంటల నుండి సాయంత్రం8 గంటల వరకు సామూహిక రుద్ర అభిషేకం. దిల్వర్చన ప్రత్యేక పూజలతో పాటు ఆలయంలో 7 గంటల నుండి నాట్ శిల్పా అకాడమీ శ్రీమతి భాగ్యరేఖ ఆధ్వర్యంలో చిన్నారుల కూచిపూడి నృత్యాలు. వివిధ సంస్కృతి కార్యక్రమాలు 9 గంటల నుండి12.30 వరకు కీర్తిశేషులు పాండురంగారావు రామదాసు దివ్య ఆశీస్సులతో. తిరు మల తిరుపతి దేవస్థానం సంగారెడ్డి బ్రహ్మశ్రీ శ్రీ లక్ష్మీ నారాయణ పురాణ పండిత్ పార్వతి పరమేశ్వరుల కళ్యాణ కథ శ్రవణం. అనంతరం పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం. ఉత్సవమూర్తుల పల్లకి సేవ. ఆలయ కమిటీ భజన భక్త బృందం ఆధ్వర్యంలో తెల్లవార్లు భజన కార్యక్రమం. కళ్యాణ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు మారేపల్లి వెంకటేశం గౌడ్ సౌజన్యంతో లడ్డు ప్రసాద వితరణ. ఈ ఉత్సవాలలో ఆలయ కమిటీ భక్త బృందం మల్లికార్జున పూర్ణచందర్. ఆకుల శివ కుమార్ మారేపల్లి చిన్న శివకుమార్. సుధాకర్. రాచన్న స్వామి. రామ్ రెడ్డి సుబ్రమణ్యం మణికంఠ. తదితర భజన భక్త బృందం
