- సంత్ శ్రీ సేవాలాల్
చరిత్ర ఆదర్శనీయం…… - బంజారాలో అన్ని రంగాలలో రాణించాలి…..
- సేవా గడ్ ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం…
- అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ.
గుత్తి ,ఫిబ్రవరి 15:
బంజారాల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జీవిత చరిత్ర ఎంతో ఆదర్శనీయమైనదని అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ తెలిపారు. ఆదివారం సేవా గడ్ లో జరిగిన సేవాలాల్ జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమం సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై పలు వేడుకలలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సభా కార్యక్రమంలో ఎంపీ మాట్లాడుతూ సేవా గడ్ సందర్శించుకోవడం తాను ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. అంతేగాక దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి ఈ పుణ్యక్షేత్రానికి బంజారా సమాజం వేలాదిగా తరలిరావడం శుభపరిణామన్నారు. దేశవ్యాప్తంగా 20 కోట్ల దాకా ఉన్న బంజారాలు అన్ని రంగాలలో రాణించాలని ఎంపీ తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజన బంజారా అభ్యున్నతికి కృషి చేస్తున్నదని కేంద్రంలో నరేంద్ర మోది, కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బడుగు బలహీన వర్గాల సంక్షేమం అభివృద్ధి కోసం కృషి చేస
