అనంతపురం జిల్లా
రాయదుర్గం నియోజకవర్గం•••••
శివరాత్రి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే.
మహాశివరాత్రి సందర్భంగా ఆ పరమశివుడి దివ్య ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని రాయదుర్గంలోని ప్రముఖ ఆలయాల్లో ఆదివారం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాయదుర్గం పట్టణంలోని కోటలో వెలసిన ప్రసిద్ధ స్వయంభు జంబుకేశ్వర స్వామి, చదం గ్రామంలో కొండపై వెలసిన ప్రసిద్ధ పశుపతినాథ ఆలయాలను దర్శించి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అత్యంత వైభవంగా ప్రారంభమైన మహాశివరాత్రి వేడుకలను పురస్కరించుకుని ఆయన మాట్లాడుతూ… నియోజకవర్గ ప్రజలపై ఆ మహాశివుడు ఆశీస్సులు మెండుగా ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో జీవించేలా దీవెనలు అందించాలని కోరుకున్నామన్నారు. రోజంతా అత్యంత పవిత్రతో ఉపవాస దీక్షచేసి రాత్రంతా జాగరణ, శివారాధనలో గడపడం ద్వారా ఒక అద్భుతమైన శక్తిపొందే అవకాశం ఉంటుందన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, సిబ్బంది స్వామివారి తీర్థప్రసాదాలను వారికి అందజేశారు. నియోజకవర్గ ప్రజలందరికీ ఆయన మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలియచేశారు.
